Reading Time: 2 minutes
Kolkata Set Target Of 156 Runs For Lucknow Ipl 2026

IPL 2026 38వ మ్యాచ్‌లో, లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 07 వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది. లక్నోకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

లక్నో బౌలర్లు కోల్ కతాపై ఆదిపత్యం చెలాయించారు. మోసిన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ తో కేకేఆర్ నడ్డి విరిచాడు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి చుక్కలు చూపించాడు. మహమ్మద్ షమీ మరోసారి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తన మొదటి ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అజింక్య రహానే ఆరు బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేయగలిగాడు. కేకేఆర్ 3 పరుగుల వద్ద తొలి దెబ్బ తిన్నది. టిమ్ సీఫెర్ట్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. తొలి ఓవర్‌లోనే మొహ్సిన్ ఖాన్ వికెట్ తీశాడు. అజింక్య రహానే పేలవమైన బ్యాటింగ్ తో నిరాశ పరిచాడు. 15 బంతుల్లో 10 పరుగులు చేసిన అజింక్య రహానేను మోసిన్ ఖాన్ ఔట్ చేసి రెండో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో కేకేఆర్ పీకల్లతో కష్టాల్లో పడింది. కేవలం 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించిన నియమం కింద అంగ్రీష్ రఘువంశీని ఔట్ చేశారు. ఆ తర్వాత మోసిన్ ఖాన్, రోవ్‌మన్ పావెల్‌ను ఔట్ చేసి మూడవ వికెట్‌ను సాధించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో కామెరాన్ గ్రీన్ వేగం పెంచి జార్జ్ లిండా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. కామెరాన్ గ్రీన్ 21 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. మొహ్సిన్ ఖాన్ నాలుగో వికెట్ తీసుకున్నాడు. మోసిన్ ఖాన్ తన నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. రమన్‌దీప్ సింగ్‌ను ఔట్ చేసి, జార్జ్ లిండా తన తొలి ఐపీఎల్ వికెట్‌ను పడగొట్టాడు.

93 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కేకేఆర్ కష్టాల్లో పడింది. 19వ ఓవర్‌లో మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదిన రింకు సింగ్, ఈ సీజన్‌లో తన రెండవ వరుస అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రింకు అద్భుతంగా బ్యాటింగ్ చేసి, 51 బంతుల్లో అజేయంగా 83 పరుగులు చేసి జట్టు పరువును నిలబెట్టాడు. ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. చివరి ఓవర్‌లో రింకు వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు లక్నో గెలవాలంటే 156 పరుగులు చేయాల్సి ఉంది.