Reading Time: < 1 minute
Vaazha 2 Creates History Emerges As All Time No 1 Industry Hit At Kerala Box Office

మలయాళ చిత్ర పరిశ్రమ మోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది.  స్టార్ పవర్ లేకుండా కేవలం కంటెంట్ మరియు యూత్ ఆడియన్స్ మద్దతుతో వచ్చిన వాల 2′ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. కేరళ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి సరికొత్త ‘ఇండస్ట్రీ హిట్’గా అవతరించింది.  బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన లోక మరియు మోహన్ లాల్ తుడరుమ్ చిత్రాల రికార్డులను అధిగమించి ఈ సినిమా ఆల్‌టైమ్ నంబర్ 1 స్థానానికి చేరుకుంది.

తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ‘వాల 2’ కేరళలో కేవలం 25 రోజుల్లోనే రూ. 122 – 123 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో కేరళ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 220 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సాధించిన మరో అరుదైన  రికార్డ్ చూస్తే.. 2000 సంవత్సరం తర్వాత కేరళ బాక్సాఫీస్ వద్ద 80 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడైన మూడవ చిత్రంగా ‘వాల 2’ నిలిచింది. గతంలో మోహన్ లాల్ నటించిన ‘నరసింహం’ మరియు ‘పులిమురుగన్’ చిత్రాలు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నాయి. ఇప్పుడు ఆ దిగ్గజాల సరసన ఈ చిన్న సినిమా చేరడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్స్ హాషిర్ మరియు టీమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విపిన్ దాస్ కథను అందించగా సవిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించారు. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.