Reading Time: 2 minutes
Rahul Gandhi Protests Lpg Gas Crisis Outside Parliament With Tea And Biscuits

భారతదేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం పార్లమెంట్‌ను తాకింది. గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. గ్యాప్ బండలకు చెందిన ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. పార్లమెంట్‌లోకి వెళ్లే మార్గంలో సహచర ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఛాయ్‌లో బిస్కెట్లు ముంచుకుంటూ తిన్నారు. గ్యాస్ సంక్షోభం కారణంగా ఛాయ్‌, బిస్కెట్స్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎల్‌పీజీ సిలిండర్ల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.

544

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను సరైన సమయానికి అందించకపోవడం, ధరలు పెరగడం వంటి అనేక సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సంక్షోభంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ‘‘ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలకు తక్షణమే సహాయం అందించాలి.’’ అని డిమాండ్చేశారు.

ఇది కూడా చదవండి: RN Ravi: ఎన్నికల వేళ కీలక పరిణామం.. బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్.రవి ప్రమాణస్వీకారం

గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయడంతో ఖమేనీ హతమయ్యాడు. దీంతో ప్రతీకారంగా ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడి చేసింది. దీంతో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో గ్యాస్ ఏజెన్సీల దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు. ఇక చెన్నైలో అయితే పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు భారీ క్యూ కట్టారు.