Reading Time: < 1 minute
Theaters Will Be Empty Until Ugadi Box Office Empty Even In The Second Week

 ప్రస్తుతం టాలీవుడ్ లో స్తబ్ధత కనిపిస్తోంది. కొత్త సినిమాల రాక తక్కువగా ఉండటంతో థియేటర్లలో ఉన్న చిత్రాలే  రన్‌ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద నెట్టుకొస్తున్నాయి. అయితే, ఈ వేసవి వేడికి తోడుగా సినిమా థియేటర్లలో సెగలు పుట్టించేందుకు ఇద్దరు భారీ స్టార్లు సిద్ధమయ్యారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కానుకగా మార్చి 19న రెండు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి.

Also Read : Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్

వాటిలో  మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ తన మ్యానరిజమ్స్‌తో థియేటర్లను హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా రూపొందిన ‘ధురంధర్ 2’ కూడా అదే రోజున (మార్చి 19) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, గ్రాండ్ మేకింగ్ వాల్యూస్‌తో వస్తున్న ఈ సినిమా ‘ఉస్తాద్‌’కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకే రోజున అటు టాలీవుడ్ నుంచి ఒక భారీ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్, ఇటు బాలీవుడ్ నుంచి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా విడుదల కానుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఉగాది సెలవుల అడ్వాంటేజ్‌ను ఏ సినిమా ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి. మరి ఈ క్రేజీ క్లాష్‌లో ‘ఉస్తాద్’ తన పవర్ చూపిస్తాడా లేక ‘ధురంధర్’ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!