Reading Time: 2 minutes
Sanju Samsons 97 Runs Powers India To Semis Echoes Gautam Gambhirs 2011 World Cup Heroics

Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2026లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులతో అజేయంగా రాణించాడు. ఒత్తిడిలోనూ చాలా కూల్ గా ఆడుతూ జట్టును విజయపథం వైపు నడిపించాడు. సంజూ శాంసన్ ఆడిన అజేయ 97 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుకు సెమీఫైనల్ టికెట్ మాత్రమే కాదు.. అతనిపై ఉన్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు.

Sanju Samson: 3 పరుగులతో సెంచరీ మిస్, మీరు నిరాశ పడ్డారా?.. సంజు షాకింగ్ ఆన్సర్!

2020 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజూ బాగా ఆడినప్పుడు గౌతమ్ గంభీర్ అతడిని భారత్‌ లో అత్యుత్తమ యువ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌ గా అభివర్ణించాడు. ముఖ్యంగా “సంజూ భారత్ తరఫున ఆడకపోతే అది సంజూకి కాదు.. దేశానికే నష్టం” అని అప్పట్లో గంభీర్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా నిరంతర అవకాశాలు ఇస్తే ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా ఎదుగుతాడని కోచ్ గంభీర్ అప్పట్లోనే విశ్వాసం వ్యక్తం చేశారు.

అప్పట్లో జట్టులో స్థానం దక్కకపోవడం, స్థిరత్వం లేకపోవడం వంటి అంశాలపై చర్చలు జరిగినా గంభీర్ మాత్రం సంజూ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇప్పుడు అదే గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉండగా.. సంజూ కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు. టోర్నమెంట్ ఆరంభంలో సంజూను జట్టులోంచి తప్పించాలని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫామ్‌ లో లేడని విమర్శలు భారీగా వచ్చాయి.

Abhishek Sharma: తీసేయండి సార్.. తీసేయండి.. బ్యాటింగ్, ఫీల్డింగ్ లో ప్లాప్ షో.. జట్టుకు భారంగా మారిన నెం.1 బ్యాటర్!

అయితే ఈ విషయాలపై తాజగా గంభీర్ స్పందిస్తూ.. “సంజూలో ఎంత సామర్థ్యం ఉందో మాకు తెలుసు. అతని ఖాతాలో మూడు టీ20 సెంచరీలు ఉన్నాయి. ప్రతి ఆటగాడికి “బ్యాడ్ టైం” వస్తుంది. అప్పుడు అతడికి మద్దతు అవసరం” అని అన్నారు. ఇది ఇలా ఉంటే.. సంజూ శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా గుర్తు ఉండిపోనుంది. అయితే కొందరు ఈ ఇన్నింగ్స్ ను 2011 వరల్డ్ కప్ ఫైనల్‌ లో గంభీర్ చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్ ను గుర్తుచేసుకున్నారు. ఆ రోజు గంభీర్ కూడా కరెక్ట్ గా 97 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆయన శిష్యుడైన సంజూ కూడా అదే స్కోరుతో జట్టును గెలుపు దిశగా నడిపించడం అభిమానులను ఆకట్టుకుంది.