Reading Time: < 1 minute
Mega Star Chiranjeevi Mana Shankara Varaprasad Garu 50 Days 109 Centers 400 Crore Record

తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ‘మెగా’ రికార్డులరో మళ్ళీ కళకళలాడుతోంది, మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ రికార్డుల వేటను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం వసూళ్లలోనే కాకుండా, థియేట్రికల్ రన్‌లోనూ తన సత్తా చాటుతూ నేటితో 109 కేంద్రాల్లో 50 రోజుల ప్రదర్శనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది, నేటి కాలంలో సినిమాలు విడుదలైన రెండు వారాలకే ఓటిటి బాట పడుతున్న తరుణంలో, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సాధించిన ఈ 50 రోజుల మైలురాయి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అటు మెగాస్టార్ కెరీర్‌లోనూ, ఇటు అనిల్ రావిపూడి కెరీర్‌లోనూ ఇది మొదటి 400 కోట్ల క్లబ్ చిత్రంగా నిలిచింది, ఉత్తర అమెరికా మార్కెట్లో ఏకంగా 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి, మెగాస్టార్ గ్లోబల్ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది.

Also Read:Nikhil : నిఖిల్ ‘స్వయంభు’.. భారీ ధరకు సీడెడ్ రైట్స్.. డీల్ క్లోజ్

బుక్ మై షో ప్లాట్‌ఫారమ్‌లో 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం ఒక ప్రాంతీయ చిత్రానికి అరుదైన గౌరవంగా టీం చెబుతోంది, జీ5 (ZEE5) వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటికీ, థియేటర్లలో ఈ సినిమాకు ఆదరణ తగ్గకపోవడం విశేషం. జీ5 లో కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా అవతరించింది, ఈ భారీ విజయానికి ప్రధాన కారణం చిరంజీవి గారిలోని ‘వింటేజ్’ లుక్ అండ్ ఆయన ఎనర్జీ. ఆయన కామెడీ టైమింగ్, చురుకైన నటన ప్రేక్షకులను పాత రోజుల్లోకి తీసుకెళ్లాయి, అనిల్ రావిపూడి తనదైన శైలిలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా దీనిని తీర్చిదిద్దారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరవగా, నయనతార తనదైన గాంభీర్యంతో సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చారు, షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ ఛాయిస్‌గా నిలిచింది. మొత్తానికి, ‘మన శంకరవరప్రసాద్ గారు’ 109 కేంద్రాల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.