Reading Time: 2 minutes
Huawei Mate 80 Pro Global Launch 100w Fast Charging Ip68 Ip69 Triple Camera

Huawei Mate 80 Pro Launch: హువాయి (Huawei) నుండి సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ ఫోన్ హువాయి మేట్ 80 ప్రో (Huawei Mate 80 Pro) ను అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మాడ్రిడ్‌ లో జరిగిన “Now is Your Run” కార్యక్రమంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. చైనా వేరియంట్‌తో పోలిస్తే గ్లోబల్ వేరియంట్‌ లో కొన్ని మార్పులు ఉన్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో చూసేద్దామా..

హువాయి మేట్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. చైనాలో విడుదలైన మోడల్ ‘హార్మొనీ ఓఎస్’ (HarmonyOS 6.0) తో పనిచేస్తుండగా.. అంతర్జాతీయ వెర్షన్ మాత్రం EMUI 15.0 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, గోల్డ్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రస్తుతానికి 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్‌ను మాత్రమే పరిచయం చేసింది.

Vivo & iQoo Price Hike: భారీగా పెరగనున్న వివో,ఐకూ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు..!

ఈ స్మార్ట్‌ఫోన్ 6.75-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2832 × 1280 పిక్సెల్ రిజల్యూషన్, 460ppi పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. దీని డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1440Hz PWM డిమ్మింగ్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో మూడు శక్తివంతమైన కెమెరాలు ఉన్నాయి.

Image (1)

ఇందులో ప్రధాన కెమెరా 50MP సెన్సార్‌తో కూడిన వేరియబుల్ అపెర్చర్ (f/1.4 నుండి f/4.0), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సదుపాయం ఉంది. దీనితోపాటు 40MP సెన్సార్ అల్ట్రా-వైడ్ కెమెరా, 48MP మాక్రో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 MP వైడ్ యాంగిల్ ఆటో ఫోకస్ కెమెరాను అమర్చారు. ఇందులో 5,750mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది.

Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

ఈ ఫోన్ దుమ్ము మరియు నీటి నుండి రక్షణ కోసం IP68+IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఇందులో Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, NavIC సపోర్ట్ ఉన్నాయి. గ్లోబల్ మోడల్‌లో ఏ చిప్‌సెట్ వాడారనేది హువాయి అధికారికంగా వెల్లడించలేదు. కానీ చైనా మోడల్‌లో మాత్రం కిరిన్ 9030 ప్రో (Kirin 9030 Pro) చిప్‌సెట్ ఉంది. ప్రస్తుతానికి దీని ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే వివిధ దేశాల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో హువాయి వాచ్ GT రన్నర్ 2, వాచ్ అల్టిమేట్ 2, మేట్‌ ప్యాడ్ మినీ వంటి ఇతర గ్యాడ్జెట్లను కూడా లాంచ్ చేసింది.

Image (2)