Reading Time: < 1 minute
Vijay Deverakonda Rashmika Mandanna Ranabaali Movie Wedding Song Glimpse

నిజ జీవితంలో ఒక్కటైన టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఇప్పుడు వెండితెరపై కూడా ‘పెళ్లి’ సందడితో పలకరించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’.19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక ‘జయమ్మ’గా కనిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Also Read : Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’ కోసం లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ..

‘నిజ జీవితంలో ఒకటయ్యారు.. వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు” అంటూ చిత్ర యూనిట్ పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఏందయ్యసామీ..’ అంటూ సాగే పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ పీక్స్‌లో ఉంది. మునుపటి చిత్రాలు ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లలో వీరి జోడీకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పుడు భార్యాభర్తలుగా మారిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ పెళ్లి సాంగ్ గ్లింప్స్ అభిమానులకు ఫుల్ మీల్స్‌లా ఉంది.ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (మమ్మీ ఫేమ్) విలన్‌గా నటిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గీత గోవిందం నాటి మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేస్తూ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.