Reading Time: < 1 minute
India Issues Urgent Advisory Leave Iran Immediately Helpline Numbers

India: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అక్కడ ఉన్న భారతీయ పౌరులందరూ వెంటనే ఇరాన్‌ను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు లేదా భారత్‌కు తిరిగి రావాలని సూచించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ప్రకటనలో ఏం చెప్పిందంటే.. ఇరాన్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు ఎవరైనా సరే.. అందుబాటులో ఉన్న విమానాలు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది.

READ ALSO: Quick Sooji Chilla Recipe: కేవలం 10 నిమిషాల్లో టేస్టీ, హెల్దీ బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ

భారీ జనసమూహాలు, నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించింది. అత్యవసరంగా ప్రయాణించాల్సి వస్తే ఇబ్బంది కలగకుండా.. పాస్‌పోర్ట్, వీసా, ఐడి కార్డులను ఎప్పుడూ తమ వద్దే ఉంచుకోవాలని భారతీయులకు తెలిపింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులందరూ తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. దీనివల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రభుత్వం నేరుగా వారిని సంప్రదించి సహాయం చేయడానికి వీలవుతుంది.

హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..
మీకు లేదా మీకు తెలిసిన వారికి ఇరాన్‌లో ఏదైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి ఈ నంబర్లు ఉపయోగించాలని సూచించింది.

ఫోన్ నంబర్లు: * +98 9128109115

* +98 9128109109

* +98 9128109102

* +98 9932179359

* ఇమెయిల్: cons.tehran@mea.gov.in

ఇరాన్‌లో పరిస్థితి వేగంగా మారుతున్నందున, అక్కడ ఉన్న భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరూ రిస్క్ తీసుకోవద్దని, వీలైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలని సూచించింది.

READ ALSO: HAL Clarifies: తేజస్ విమానం కూలిపోలేదు.. అసలు నిజం ఇదే: పుకార్లపై హెచ్ఏఎల్ స్పష్టత