Reading Time: 2 minutes

మున్సిపల్ ఎన్నికల అసలు ఆట మొదలు.. మేయర్, చైర్ పర్సన్ ఎన్నికలు లైవ్ అప్ డేట్స్

Caption of Image.

రంగారెడ్డి జిల్లా:

* ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 3వ వార్డులో గెలిచిన ఇండిపెండెంట్ దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదని, కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు

* 19వ వార్డులో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి కనిపించడం లేదంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అతని ఫ్యామిలీ కంప్లైంట్

వరంగల్ జిల్లా:

  • తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియల్ ఓటు హక్కు కల్పించవద్దని ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతల కంప్లయింట్

జగిత్యాల జిల్లా:

* జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్గా సమిండ్ల వాణి పేరు ఖరారు 
* సీల్డ్ కవర్లో మున్సిపల్ కార్యాలయానికి చేరిన వాణి పేరు
* సంజయ్ వర్గానికే చైర్ పర్సన్  పీఠం

మహబూబాబాద్ జిల్లా:

  • తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత
  • భారీగా మోహరించిన పోలీసులు
  • తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 16, ఇద్దరు ఎక్స్ అఫిషీయో సభ్యులతో కలిసి 18 ఓట్లు
  • మేజిక్ ఫిగర్ 10.. బీఆర్ఎస్ 09, కాంగ్రెస్ 07
  • ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషీయో ఓట్లతో 09కి చేరిన కాంగ్రెస్ బలం
  • బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారని ప్రచారం
  • జనసమీకరణకు బీఆర్ఎస్ వ్యూహం
  • భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు, కొనసాగుతున్న ఉద్రిక్తత
 
  • హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్మన్గా రోంటాల సుహాసిని

నల్గొండ జిల్లా:

* హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి.. వైస్ చైర్మన్గా రాజా రమేష్ యాదవ్

*నందికొండ మున్సిపల్ చైర్మపర్సన్గా బడుగు మానస స్వర్ణ సుమన్ ఎన్నిక

సూర్యాపేట జిల్లా:

* కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకం

* మొదటి రెండు సంవత్సరాలు చైర్మన్ గా ఎర్నేని కుసుమ.. వైస్ చైర్మన్ గా దేవరపల్లి మల్లీశ్వరి 

* మిగిలిన మూడు సంవత్సరాలు చైర్మన్ పారా సత్యవతి.. వైస్ చైర్మన్ గా గుండపనేని పద్మావతి

మున్సిపల్​ ఎన్నికల నంబర్​ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచేదెవరో తేలే సమయం దగ్గర పడింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టగా.. తమకు పట్టున్న చోట పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సోమవారం కార్పొరేషన్​ మేయర్​, మున్సిపల్​చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్స్​ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా గెలిచిన వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పాలకవర్గం ఎన్నికలు ఉంటాయి. అధికార కాంగ్రెస్​ పార్టీ  తమకు ఆధిక్యం ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చాలా ఈజీగా గెలుచుకోనున్నది.

ఇదే క్రమంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని హంగ్​ స్థానాలను సైతం కైవసం చేసుకోవడానికి  వ్యూహాలు రచిస్తున్నది. ఇందుకోసం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రంగంలోకి దిగి రాష్ట్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జారిపోకుండా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​, బీజేపీ విప్​ జారీ చేయడానికి సిద్ధమయ్యాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సైతం విప్​ వర్తించేలా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీ ఎత్తుగడలు వేస్తున్నది. కాగా, 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో  పరోక్ష ఎన్నికలకు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్ (ఎస్​ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి చోట పోలీస్​ బందోబస్తు మధ్య సీసీ కెమెరాల సహాయంతో వెబ్​కాస్టింగ్​ చేయనున్నారు.

©️ VIL Media Pvt Ltd.