
T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ పై భారత్ విజయ పరంపర కొనసాగించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాక్ తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇండియన్ బ్యాటర్లు అభిషేక్ శర్మ (4), హార్థిక్ పాండ్యా (0), అక్షర్ పటేల్ (0) దారుణంగా విఫలమయ్యారు.
☝️ Faheem Ashraf
☝️ Abrar AhmedNo answer to Varun’s Chakaravyuh 🌪️
ICC Men’s #T20WorldCup | #INDvPAK | LIVE NOW 👉https://t.co/SpqYo6n3dL pic.twitter.com/MpV9Xpxpk3
— Star Sports (@StarSportsIndia) February 15, 2026
ఒకవైపు వికెట్లు పడుతున్న టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ పరుగులు వరద పారించాడు. 77 పరుగులు చేసిన తర్వాత ఇషాన్ ఔట్ అయ్యి, పెవిలియన్ కి వెళ్లగా, క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ కి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. పవర్ ప్లే ముగిసే సమయానికి కీలకమైన 4 వికెట్లను హార్ధిక్ పాండ్యా, బూమ్రా, అక్షర్ పటేల్ తీసుకున్నారు. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడిన పాక్ ను.. ఉస్మాన్ ఖాన్ (44) అదుకునే ప్రయత్నం చేయగా.. అక్షర్ పటేల్ బౌలింగ్ లో స్టంప్ ఔట్ అయ్యాడు.
ఫహీమ్ అష్రఫ్, అబ్రార్ అహ్మద్ లను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. దీంతో టీమిండియా బౌలర్ల ముందు పాక్ బ్యాటర్లు నిలవలేకపోయారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి చెరో వికెట్ తీసుకోగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ తలో వికెట్ తీసుకున్నారు.