Reading Time: 2 minutes
Actress : కూతురు హీరోయిన్.. తల్లి గ్లామర్ సెన్సేషన్.. టీవీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక నటి..

ప్రస్తుతం బుల్లితెర నటీనటులకు అత్యధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి టీవీ రంగంలో అత్యధిక రెమ్యునరేష్ తీసుకుంటున్న నటి. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ సెలబ్రిటీ అయిన శ్వేతా తివారీ. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గని గ్లామర్ వయ్యారాలతో నెట్టింట రచ్చ చేస్తుంది. శ్వేతా తివారీ ప్రస్తుతం హిందీ టీవీ షోలలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటీమణులలో ఒకరు. ఈ వయసులో కూడా తన ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న శ్వేతా తివారీ ఇప్పటికీ పాతికేళ్ల అమ్మాయిలాగే కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

బుల్లితెరపై విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా తివారీ కసౌతీ జిందగీ కే సిరీస్‌లో ప్రేరణ శర్మ పాత్రలో అద్భుతంగా నటించింది. అందుకే, ఆమె ఇప్పటికీ హిందీ టెలివిజన్‌లో ప్రేరణ శర్మగా అభిమానులు పిలుచుకుంటున్నారు. శ్వేతా తివారీ తన కూతురిని కథానాయికగా పరిచయం చేసింది. ఆమె మొదట 1998లో టెలివిజన్ నటుడు రాజా చౌదరిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2013లో అభినవ్ కోహ్లీని వివాహం చేసుకుంది. కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంటుంది. శ్వేతా తివారీ కూతురు పాలక్ తివారీ బాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్. పాలక్ కూడా తన తల్లిలాగే చాలా గ్లామరస్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

పాలక్ తివారీ 2021లో రోజీ: ది సాఫ్రాన్ చాప్టర్ అనే వెబ్ సిరీస్‌తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆమె అందం, ఆకర్షణతో పాటు, ఆమె ప్రతిభ వినోద పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే హిందీలో వరుస అవకాశాలు అందుకుంటుంది పాలక్ తివారి.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..