Reading Time: 2 minutes
Actress : ఎన్టీఆర్, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. రెండుసార్లు క్యాన్సర్‌తో పోరాటం.. ఇప్పుడు సినిమాల్లో ఇలా..

పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో పలు చిత్రాల్లో నటించి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, నాగార్జునతో ఆమె చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే క్యాన్సర్ బారిన పడింది. రెండుసార్లు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే మమతా మోహన్ దాస్. దర్శకుడు హరిహరన్ దర్శకత్వం వహించిన ‘మయూఖం’ చిత్రంతో మమత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

నటనలోనే కాకుండా సంగీతంలోనూ మమత తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ‘డాడీ మమ్మీ’ వంటి హిట్ పాటలతో దక్షిణ భారతదేశం అంతటా అభిమానులను సృష్టించుకుంది. ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో నటించింది. అలాగే నాగార్జున నటించిన కింగ్ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. మమత రెండుసార్లు క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొంది. ఆమె జీవితం ముగిసిపోతుందని అనిపించినప్పుడు కూడా, ఆమె ఆత్మవిశ్వాసంతో పోరాడింది. చికిత్స సమయంలో తన పనిపై దృష్టి సారించి, తిరిగి జీవితంలోకి రావడానికి మమత ధైర్యం అసమానమైనది.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

చివరకు ఆమెకు విటిలిగో ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు కూడా, మమత ప్రపంచంతో చాలా సానుకూలంగానే ఉంది. తన శరీరంలోని మార్పులను ప్రేమతో స్వీకరించడానికి, వెలుగును చిరునవ్వుతో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఆమె ఎప్పుడూ తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరచడంలో, తాను ఇష్టపడేది చేయడంలో ముందు ఉంటుంది. సంక్షోభాలు వచ్చినప్పుడు నిరుత్సాహపడే వారికి పునాది నుండి ఎలా లేవాలో మమతా మోహన్‌దాస్ ఒక చక్కని ఉదాహరణ.

క్యాన్సర్ తో పోరాడి గెలిచిన మమతా.. ప్రస్తుతం తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఆమె తెలుగులో చివరగా జగపతి బాబు నటించిన రుద్రాంగి చిత్రంలో కనిపించింది. ఇప్పుడు సరైన అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

 

View this post on Instagram

 

A post shared by Mamta Mohandas (@mamtamohan)

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..