Reading Time: 2 minutes
6,6,6,6,6.. 20 బంతుల్లో ఛోటా ప్యాకెట్ బీభత్సం.. ఏకంగా 254 స్ట్రైక్ రేట్‌తో ఉతికారేసిన ఇషాన్

Ishan Kishan: టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, తొలి ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. తుఫాన్ ఆరంభంతో నమీబియాపై చెలరేగిపోయారు టీమిండియా బ్యాటర్లు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ మరోసారి తన బ్యాట్ ఝులిపించాడు. కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 5 సిక్స్‌లు, 6 ఫోర్లు ఉన్నాయి. ధాటిగే ఆడే క్రమంలో ఓ భారీ షాక్ ఆడబోయి 61 పరుగులకు పెవిలియన్ చేరాడు.

 పవర్ ప్లే చివరి ఓవర్లో ఇషాన్ వరుసగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి తన అర్ధ సెంచరీని చేరుకున్నాడు. శాంసన్ 22 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో ఇషాన్‌తోపాటు టీమిండియా పేరిట కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం..

టీ20 ప్రపంచకప్‌లో భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన హఆఫ్సెంచరీలు (బంతుల ఆధారంగా)

12 – యువరాజ్ సింగ్ vs ఇంగ్లండ్, డర్బన్, 2007

18 – కేఎల్ రాహుల్ vs స్కాంట్లాండ్, దుబాయ్, 2021

19 – రోహిత్ శర్మ vs ఆస్ట్రేలియా, 2024

20 – యువరాజ్ సింగ్ vs ఆస్ట్రేలియా, డర్బన్, 2007

20 – ఇషాన్ కిషన్ vs NAM, ఢిల్లీ, 2026

టీ20 ప్రపంచకప్ పవర్‌ప్లేలో భారతదేశం తరపున 50 పరుగులు..

51*(21) – రోహిత్ శర్మ vs ఆస్ట్రేలియా, గ్రోస్ ఐలెట్, 2024

50(19) – కేఎల్ రాహుల్ vs స్కాంట్లాండ్, దుబాయ్, 2021

50(20) – ఇషాన్ కిషన్ vs నమీబియా, ఢిల్లీ, 2026

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌లు..

92/1 – WI vs AFG, గ్రోస్ ఐలెట్, 2024

91/1 – NED vs IRE, సిల్హెట్, 2014

89/3 – ENG vs SA, ముంబై WS, 2016

86/1 – IND vs NAM, ఢిల్లీ, 2026

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అత్యధిక పవర్‌ప్లే స్కోర్లు..

95/1 vs ENG, ముంబై, 2025

94/2 vs NZ, గౌహతి, 2026

86/1 vs NAM, ఢిల్లీ, 2026 టీ20 ప్రపంచకప్

82/2 vs SCOT, దుబాయ్, 2021 టీ20 ప్రపంచకప్

82/1 vs BAN, హైదరాబాద్, 2024

టీ20 ప్రపంచకప్‌లో భారతదేశం తరపున 1-6 ఓవర్లలో 50 పరుగులు..

అభిషేక్ శర్మ (మూడు సార్లు)

రోహిత్ శర్మ (రెండు సార్లు)

ఇషాన్ కిషన్ (రెండు సార్లు)

కేఎల్ రాహుల్ (ఒక్కసారి)

యశస్వి జైస్వాల్ (ఒక్కసారి)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..