Reading Time: < 1 minute

కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన.. ఒకరు పాప.. మరొకరు బాబు

Caption of Image.

ఉపాసన కొణిదెల, రాంచరణ్ దంపతులకు కవల పిల్లలు పుట్టారు. కొద్దిసేపటి క్రితం అపోలోలో పండంటి కవలలకు ఉపాసన జన్మనిచ్చింది. ఒక బాబు, ఒక పాప పుట్టారు. చిరంజీవి ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ సోమవారం ఉదయం 10 గంటలకి మీడియాతో మాట్లాడనున్నారు. 9వ నెల పడగానే ఉపాసనాకి వైద్యులు సీ సెక్షన్ చేసి ప్రసవం చేశారు. మొదట బేబీ బాయ్, తరువాత బేబీ గర్ల్ పుట్టారు. ఇప్పటికే రాం చరణ్, ఉపాసన దంపతులకు 2023లో పాప పుట్టిన సంగతి తెలిసిందే.

కవలలు పుట్టిన శుభ సందర్భంగా ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రాంచరణ్, ఉపాసనకు కవలలు పుట్టారని, వారిలో ఒకరు బాబు, ఒకరు పాప అని చిరంజీవి పోస్ట్ చేశారు. 

తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని.. ఈ ఇద్దరు చిన్నారులను దైవ ఆశీర్వచనాలుగా భావిస్తూ.. ఎంతో సంతోషంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ కుటుంబ క్షేమం కోరి ప్రార్థనలు చేసిన ప్రతీ ఒక్కరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.