Reading Time: < 1 minute
Lucknow Shock Case Minor Abducted To Nainital Assaulted And Blackmailed For %e2%82%b910 Lakh

Shocking: సభ్య సమాజం తలదించుకునే చర్యకు పాల్పడింది ఒక మహిళ. లక్నోలోని ఒక మహిళ 17 ఏళ్ల మైనర్ విద్యార్థిపై లైంగిక దాడి చేసింది. అంతటితో ఆగకుండా ఈ చిత్రాలను, వీడియోలను అడ్డుపెట్టుకుని బాలుడిని బ్లాక్‌మెయిల్ చేసింది. ఈ ఘటనకు పాల్పడింది బాలుడి స్నేహితుడి వదిన. నిందితురాలు అశ్లీల వీడియోలను రికార్డ్ చేసి, ఫోటోలు తీసి రూ. 10 లక్షలు డిమాండ్ చేసింది. సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Pappu Yadav: ‘‘రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంలోకి వెళ్లాల్సిందే’’.. మహిళలపై ఎంపీ అసభ్యకర వ్యాఖ్యలు..

ఫిబ్రవరి 17, 2026న తన కొడుకు కనిపించకుండా పోయాడని తల్లి ఆరోపించింది. ఆ తర్వాత వెతకడం ప్రారంభిస్తే, క్యాంప్‌బెల్ రోడ్‌లోని ఒక స్నేహితుడి ఇంటికి తరుచుగా వెళ్లేవాడని తేలింది. బాలుడి స్నేహితుడిని ప్రశ్నించగా.. తన వదిలతో అతను ఎక్కడికో వెళ్లినట్లు చెప్పాడు. దీని తర్వాత ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. అయితే, నిందితురాలు ఒక పథకం ప్రకారం, బాలుడిని నైనిటాల్ తీసుకెళ్లినట్లుగా తేలింది. మార్గం మధ్యలో అతడి మొబైల్ స్వాధీనం చేసుకుని, సిమ్ తీసి పారేసింది. నైనిటాల్ లోని ఒక హోటల్‌లో నిందితురాలు బాలుడితో శారీరకంగా కలిసింది. ఆ సమయంలోనే బాలుడితో అసభ్యకరమైన స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియోలు తీసింది.

దీని తర్వాత సదరు మహిళ, బాలుడిని ఈ ఫోటోలు వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసింది. రూ. 10 లక్షలు ఇవ్వకుంటే వీటిని వైరల్ చేస్తానని బెదిరించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించగా, ఫిబ్రవరి 21న పోలీసులు బాలుడిని గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. 9వ తరగతి చదువుతున్న బాలుడి తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు చెప్పడంతో, నిందితురాలిని అరెస్ట్ చేశారు.