Reading Time: 2 minutes
Ai Impact On Students Brain Learning Critical Thinking Education Debate

AI students education: కాలం మారింది. ఇప్పుడు గణితం లేదా సైన్స్‌లోని ప్రశ్నలను ఛేదించడానికి గంటల తరబడి ఆలోచించాల్సిన అవసరం లేదు. చరిత్రను బట్టిపట్టాల్సిన పని లేదు. హోంవర్క్ గురించి తల్లిదండ్రులతో పిల్లల వాదనలు లేవు. ఇది ఏఐ యుగం. విదేశీ భాషా పాఠాన్ని అర్థం చేసుకోవడంలో అయినా, ఏ సమాచారాన్ని నేర్చుకోవడంలో అయినా పిల్లలకు చాలా ఈజీ. ఎందుకంటే పిల్లల చేతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే అతిపెద్ద ఆయుధం ఉంది. కానీ.. ఏఐపై అనేక అనుమానాలూ ఉన్నాయి. ఈ ఆయుధం విద్యార్థుల సహజ మేధస్సుకు ముప్పు కలిగిస్తుందా లేదా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవలి సేకరించిన ప్రపంచ డేటా, నిపుణుల అభిప్రాయాలు ఓ కొత్త చర్చను రేకెత్తించాయి. ఈ అంశంపై పూర్తి వివరాలను తెలుసుకుందాం..

READ MORE: Shocking: 9వ తరగతి బాలుడిపై స్నేహితుడి వదిన అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్..

గ్యాలప్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. దాదాపు 57% మంది విద్యార్థులు ప్రతి వారం ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వంటి విదేశీ విద్యా సంస్థలు రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ వంటి పనుల కోసం దీనిని విజయవంతంగా వాడుతున్నాయి. కానీ, ఈ సౌలభ్యం వెనుక ఉన్న ప్రమాదాలను నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏఐ వాడకం వల్ల ముఖ్యంగా విమర్శనాత్మక ఆలోచనా శక్తి (Critical Thinking) క్షీణించి పోతుందట. విద్యార్థులు తమ హోంవర్క్ లేదా వ్యాసాల కోసం ఏఐ మీద ఆధారపడటం వల్ల, సొంతంగా ఆలోచించే, విశ్లేషించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారట. దీనిని నిపుణులు ‘కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్’ అని పిలుస్తున్నారు. అంతేకాదు.. ఏఐ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని సైతం ఎంతో నమ్మకంగా చెబుతుంది. విద్యార్థులు దానిని గుడ్డిగా నమ్మడం వల్ల తప్పుడు జ్ఞానాన్ని పొందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏఐ సహాయంతో డిగ్రీలు సాధించినా, రేపు పని ప్రదేశంలో (Workplace) సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ తరం విద్యార్థులు విఫలమయ్యే అవకాశం ఉందట.

READ MORE: Amazon: ఒక్క ఒప్పందంతో ఏఐ ప్రపంచాన్ని షేక్ చేసిన అమెజాన్! రూ.2,10,000 కోట్లతో అమెజాన్ సాహసోపేత నిర్ణయం..

మరోవైపు.. కొందరు నిపుణులు మాత్రం ఏఐని సమర్థిస్తున్నారు. ఏఐని సరిగ్గా ఉపయోగిస్తే విద్యార్థులు మరింత తెలివిగా మారుతారని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రపంచంలోని అపారమైన జ్ఞానాన్ని ఏఐ ద్వారా విద్యార్థులు పొందగలుగుతున్నారట. ఇది వారిలో అన్వేషణా తత్వాన్ని పెంచుతుందే తప్ప, వారిని సోమరిపోతులుగా మార్చదని వీరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు వాదనలు పరిశీలించి మనం ఓ మనం నిర్ణయానికి రావాలి. ఏఐ అనేది ఒక ‘అసిస్టెంట్’ (సహాయకుడి)లా మాత్రమే ఉండాలి తప్ప, ‘మెదడు’కు ప్రత్యామ్నాయం కాకూడదు. విద్యా సంస్థలు ఏఐ వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. సాంకేతికతను వాడుకుంటూనే, మానవ మేధస్సును పదును పెట్టుకున్నప్పుడే ఈ తరం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగలదు.