Reading Time: 2 minutes
Japan Lifts Lethal Weapons Export Ban Fighter Jets 2026

Japan: ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్‌లో ఒక పెను మార్పు చోటుచేసుకుంది. శాంతి మంత్రాన్ని జపిస్తూ దశాబ్దాలుగా ఆయుధ విక్రయాలకు దూరంగా ఉన్న జపాన్, ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, యుద్ధ విమానాలతో సహా భారీ ఆయుధాలను ఇతర దేశాలకు విక్రయించేందుకు జపాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Kedarnath: కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్కంద పురాణంలో ఉన్న అసలు రహస్యం ఇదే!

50 ఏళ్ల నిషేధానికి తెర
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తన రాజ్యాంగం ప్రకారం ఆయుధాల ఎగుమతిపై కఠినమైన నిషేధాన్ని విధించుకుంది. అయితే మారుతున్న అంతర్జాతీయ భద్రతా సమీకరణాల దృష్ట్యా తాజాగా జపాన్ ప్రధాని సనాయే తకైచి మంత్రివర్గం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆయుధ మార్కెట్లో జపాన్ ఏమి విక్రయిస్తుందో అధికారికంగా జాబితాను ప్రకటించనప్పటికీ, ఫైటర్ జెట్‌లు, క్షిపణులు, అత్యాధునిక యుద్ధనౌకలను విదేశాలకు విక్రయించనున్నట్లు జపనీస్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా కోసం ప్రత్యేక యుద్ధనౌకలను నిర్మించడానికి జపాన్ అంగీకరించడం గమనార్హం.

షరతులు వర్తిస్తాయి
ఆయుధాల విక్రయంలో జపాన్ కొన్ని కఠినమైన నిబంధనలను కూడా విధించింది. కేవలం ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్‌కు కట్టుబడి ఉండే దేశాలకు మాత్రమే ఆయుధాలను విక్రయిస్తామని ప్రధాని తకైచి స్పష్టం చేశారు. “ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేశం కూడా తన రక్షణను తాను ఒంటరిగా చూసుకోలేదు. అందుకే సహకారం అవసరం” అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి సుమారు 17 దేశాలు జపాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి అర్హత సాధించాయి. భవిష్యత్తులో ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటే ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. 1967లో ప్రవేశపెట్టి, 1976లో పటిష్టం చేసిన పాత నిబంధనల ప్రకారం.. జపాన్ కేవలం నిఘా పరికరాలు, మైన్-స్వీపింగ్ వంటి ప్రాణాంతకం కాని సామాగ్రిని మాత్రమే ఎగుమతి చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా ఫైటర్ జెట్‌ల విక్రయానికి సిద్ధమవ్వడం ద్వారా అమెరికా, రష్యా, చైనా వంటి ఆయుధ దిగ్గజ దేశాలకు జపాన్ గట్టి పోటీనివ్వబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Kerala: కేరళలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం..