
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, హీరోయిన్లపై వేధింపుల గురించి ఎప్పుడూ వింటూనే ఉంటాం. అయితే, తాజాగా నటుడు జేడీ చక్రవర్తి ఒకప్పటి స్టార్ హీరోయిన్‌కు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని పంచుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో కలకలం రేపుతున్నాయి. జేడీ చక్రవర్తి మాటల్లో “అప్పుడు నేను విలన్‌గా చిన్న పాత్రలు చేస్తున్నాను. ఒక హీరోయిన్ నాకు, నటుడు సురేష్‌కు మంచి ఫ్రెండ్. ఒకరోజు ఆమె మమ్మల్ని డిన్నర్ కోసం గెస్ట్ హౌస్‌కు పిలిచింది. మేం అక్కడ ఉండగా రాత్రి 8:30 గంటల సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. బయట ఉన్న వ్యక్తిని చూడగానే ఆ హీరోయిన్ భయంతో వణికిపోయింది. వెంటనే మమ్మల్ని మంచం కింద దాక్కోమని బ్రతిమాలింది.”
Also Read :Peddi : ‘పెద్ది’ షూట్ కంప్లీట్ కావడానికి ముహూర్తం ఫిక్స్!
“మంచం కింద మేం ఉన్నాం.. పైన ఆ హీరోయిన్, లోపలికి వచ్చిన ఆ ప్రొడ్యూసర్ మధ్య జరిగిన సంభాషణ విని మాకు షాక్ తగిలింది. వచ్చిన వ్యక్తికి ఆ అమ్మాయికి తాత అంత వయసు ఉంటుంది. కనీసం సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆ ముసలి ప్రొడ్యూసర్, ఆ హీరోయిన్ పట్ల ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు చాలా అసభ్యంగా ఉన్నాయి. అతను వెళ్లిన తర్వాత మేం బయటకు వస్తే, ఆ హీరోయిన్ నవ్వుతూ కనిపించింది. కానీ మా కళ్లలో నీళ్లు తిరిగాయి.” ఆ హీరోయిన్ తమతో అన్న మాటలను జేడీ గుర్తు చేసుకుంటూ.. “వాడు ముసలోడ్రా.. వాడి దగ్గర భరించలేని వాసన వస్తోంది. కానీ ఏం చేస్తాం? వాడు పెద్ద ప్రొడ్యూసర్.. ఇండస్ట్రీలో ఉండాలంటే తప్పదు కదా” అని ఆమె నవ్వుతూనే తన బాధను చెప్పుకుందని జేడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అమ్మాయి కూడా ఇష్టపడి ఇలాంటి పనులు చేయదని, పరిస్థితులు మరియు అవకాశాల కోసం చేసే పోరాటంలో ఇలాంటి దారుణాలను భరించాల్సి వస్తుందని జేడీ చక్రవర్తి కుండబద్దలు కొట్టారు.