Reading Time: < 1 minute

మేడారం భక్తులకు  హెలికాప్టర్‌‌‌‌ సేవలు

Caption of Image.
  • – హన్మకొండ నుంచి ట్రిప్పులు
  • – నేటి నుంచి ప్రారంభం

ములుగు, వెలుగు: మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 28నుంచి మహాజాతర ప్రారంభం కానుండగా ఈ  సర్వీసులను వారం ముందు నుంచే ప్రారంభిస్తున్నారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్​ లైన్స్​ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. మేడారం సమీపంలోని పడిగాపూర్​వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి జాయ్​రైడ్ ఫ్రారంభం అవుతుంది. గురువారం ప్రారంభమయ్యే సేవలకు.. 6 నుంచి 7నిమిషాల రైడ్ కు ఒక్కొక్కరి నుంచి రూ.4, 800 చార్జ్​ చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా హన్మకొండ నుంచి మేడారం జాతరకు రావాలనుకునే భక్తులకు కూడా ఈ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

హన్మకొండలోని ఆర్ట్స్​అండ్​సైన్స్​కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​ నుంచి మేడారానికి ఒక్కొక్కరి నుంచి  రూ.35,999లు చార్జ్​చేయనున్నట్టు నిర్వాహకులు  వెల్లడించారు. జాతర ముగిసే తేదీ 31 వరకు హెలికాప్టర్ సేవలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. సర్వీసులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే కొనసాగనున్నాయి. పూర్తి వివరాలకు 8530004309, 9676320139 నెంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. 

©️ VIL Media Pvt Ltd.