విపత్తు వల్ల కలిగే అపారమైన బాధను మానవత్వంతో మేళవించి, ప్రేక్షకులను సన్నివేశాల్లోకి లీనం చేసే ఈ చిత్రానికి అభిమానుల నుంచి భారీ స్పందన వస్తుంది. దాదాపు ఏడేళ్లుగా ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదు. రూ. 26 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 170 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసుకుందామా.
‘2018’ అనేది జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కేరళలో జరిగిన విపత్తు ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టోవినో థామస్, ఆసిఫ్ అలీ, కుంచాకో బోబన్, నరేన్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణా బాలమురళి అనేక ఇతర నటీనటులు నటించారు. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
కథ విషయానికొస్తే, అనూప్ (టోవినో థామస్) సైన్యం పట్ల ఉన్న భయంతో ఇంటికి తిరిగి వస్తాడు. దానికి కారణం అతని భయమే. గ్రామంలో అతను ఉపాధ్యాయురాలు మంజుతో ప్రేమలో పడతాడు. మరోవైపు, మథన్ (లాల్) జాలరిగా పనిచేస్తాడు. అతని కొడుకు మోడలింగ్ రంగంలో రాణించాలని కలలు కంటాడు. ప్రజలను రక్షించడానికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న షాజీ (కుంచాకో బోబన్)తో సహా, కేరళ వరదల్లో ఎంతమంది హీరోలుగా మారారు అనేది ‘2018’ సినిమా కథ.
2018లో కేరళ భారీ వర్షాలు, మరణాలు, కొండచరియలు విరిగిపడటం, ప్రజల స్థానభ్రంశంతో ఒక పెద్ద విపత్తును ఎదుర్కొంది. జూడ్ ఆంటోనీ జోసెఫ్ ఆ సంఘటనను తెరపై చిత్రీకరించారు. ముఖ్యంగా మానవత్వాన్ని చాటిచెప్పే దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. భావోద్వేగభరితమైన పతాక సన్నివేశం ప్రేక్షకులను తప్పకుండా కట్టిపడేస్తుంది.
డాక్యుమెంటరీగా మారే అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ, దర్శకుడు ఈ చిత్రాన్ని వాణిజ్య స్థాయికి తీసుకువచ్చి విజయవంతం చేశాడు. ఇందులో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ, వాటిని తీర్చిదిద్దిన తీరు విశేషమనే చెప్పాలి. ప్రతి పాత్రకూ ఒక నేపథ్య కథ ఉండటం, అందరినీ ఒకేచోట చేర్చడంతో కథనం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.




