
హైదరాబాద్సిటీ, వెలుగు: దిల్‌సుఖ్‌నగర్ శాలివాహన నగర్‌లో గణేశ్ ఉత్సవాల సందడి మొదలైంది. జై గణేశ్యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గణపయ్య ఆగమనం శోభాయాత్ర ఘనంగా సాగింది.
డీజే హోరు, డప్పు చప్పుళ్లు, వేద మంత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ వేలాది మంది భక్తులు స్వాగతం పలికారు. ముంబై లాల్‌బాగ్‌చా రాజా కళాకారులతో ప్రత్యేకంగా తయారు చేయించిన కిరీటం, ఆభరణాలు ఈ విగ్రహానికి అలంకరించారు. సంఘం ప్రతినిధి కీర్తన్గోయల్ పాల్గొన్నారు.