
చిన్న కార్ల విభాగంలో చెరగని ముద్ర వేసిన క్విడ్ సరికొత్త ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్ హంగులతో మరింత పటిష్టంగా రూపుదిద్దుకుంది. మెరుగైన భద్రతా ప్రమాణాలతో పాటు అధునాతన ఇంటీరియర్ అనుభూతిని అందించే లక్ష్యంతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ కారు విశేషాలు తెలుసుకుందాం.
ఆకర్షణీయమైన డిజైన్
ఈ కారు ముందు భాగంలో పదునైన కొత్త బంపర్, గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ గ్రిల్‌ను అమర్చగా అన్ని వేరియంట్లలో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా స్టాండర్డ్‌గా వస్తున్నాయి. వెనుక వైపు పారదర్శక లెన్స్‌లతో కూడిన కొత్త టెయిల్ ల్యాంప్‌లు ఉండగా లోగోలోనే రివర్సింగ్ కెమెరాను అత్యంత చాకచక్యంగా సమీకృతం చేశారు. టాప్-ఎండ్ అవుట్‌సైడర్ వేరియంట్ డ్యూయల్-టోన్ రూఫ్ మరియు 14 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే డ్యాష్‌బోర్డ్‌లో పెద్ద మార్పులు చేసి 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో పాటు 7 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, రెండు యూఎస్‌బీ టైప్-సి పోర్టులు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
భద్రతా ప్రమాణాలు
మెకానికల్ పరంగా ఇందులో అదే 1.0 లీటర్ 3-సిలిండర్ ఎస్సీఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌ను కొనసాగించగా ఇది ఫ్లెక్స్-ఫ్యూయల్‌పై 71 హెచ్‌పీ పవర్, 98 ఎన్ఎం టార్క్ మరియు పెట్రోల్‌పై 68 హెచ్‌పీ పవర్, 92 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బూట్ స్పేస్ 290 లీటర్లుగా ఉండగా వెనుక సీట్లు మడిచితే అది ఏకంగా 1,100 లీటర్లకు పెరుగుతుంది. ప్రయాణీకుల భద్రత కోసం ప్రామాణికంగా 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు టీపీఎంఎస్ వంటి అధునాతన ఫీచర్లను పొందుపరిచారు. బ్రెజిల్ మార్కెట్లో ఎవల్యూషన్ వేరియంట్ ధర సుమారు రూ. 13.19 లక్షలు, టెక్నో రూ. 14.10 లక్షలు అలాగే అవుట్‌సైడర్ వేరియంట్ ధర రూ. 15.75 లక్షలుగా నిర్ణయించగా భారత్‌లో ఈ మోడల్ విడుదలపై కంపెనీ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.