Reading Time: 2 minutes

ఈ వారం ఓటీటీ సినిమాలు: కంటెంట్తో కిక్కిచ్చే మథిమారన్, ఐ నో బడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Caption of Image.

టైటిల్ : మథి మారన్
డైరెక్షన్ : మంత్ర వీరపాండియన్
కాస్ట్ : వెంకట్ సెంగుట్టువన్, ఇవానా, ఎం.ఎస్ భాస్కర్, ఆడుకాలమ్ నరేన్, చెల్లాదురై
ప్లాట్​ఫాం : అమెజాన్ ప్రైమ్ 

 అందమైన పల్లెటూరిలో పోస్టుమేన్‌‌గా పనిచేసే సుందరానికి కవల పిల్లలు మథి, నెడుమారన్‌‌. శారీరక ఎదుగుదల ఆగిపోవడంతో నెడుమారన్‌‌ను అందరూ పొట్టివాడంటూ ఆటపట్టిస్తుంటారు. అయితే అతని ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా మథి ఎప్పుడూ అండగా నిలుస్తుంది. చదువు పూర్తయ్యాక తండ్రిలాగే పోస్టుమేన్‌‌ కావాలనేది నెడుమారన్‌‌ కల. అతని తెలివితేటలు, వ్యక్తిత్వానికి ఆకర్షితురాలైన ప్రభావతి అతన్ని ప్రేమిస్తుంది. కానీ అనూహ్యంగా మథి తాను ప్రేమించిన వ్యక్తితో ఊరొదిలి వెళ్లిపోతుంది.

ఆమె గర్భవతి అన్న విషయం కూడా తెలియడంతో సుందరం, అతని భార్య అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. అక్కను వెతుక్కుంటూ నెడుమారన్‌‌ చెన్నైకి చేరుకున్న సమయంలో అక్కడ వరుస హత్యలు జరుగుతుంటాయి. మరి మథి ఎక్కడుంది? నెడుమారన్‌‌ ఆమెను కలుసుకోగలిగాడా? వరుస హత్యల వెనుక ఉన్నదెవరు? పోస్టుమేన్‌‌ కావాలనే అతని కల నెరవేరుతుందా? అనేది మిగతా కథ.

మాయమైన రూ.17 కోట్లు 

టైటిల్ : ఐ, నో బడీ
డైరెక్షన్ : నిస్సమ్ బషీర్
కాస్ట్ : పృథ్విరాజ్ సుకుమారన్, పార్వతీ తిరువోతు, హకిమ్ షాజహాన్, అశోకన్, మధుపాల్, విజయరాఘవన్
ప్లాట్​ఫాం : జియో హాట్ స్టార్ 

రాజీవ్‌‌ ఓ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంటాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో ఓ రోజు అతను బ్యాంకుకు వెళతాడు. అదే సమయంలో ముగ్గురు దొంగలు ఆయుధాలతో బ్యాంకులోకి చొరబడి రూ.17 కోట్లు దోచుకుంటారు. రాజీవ్‌‌తో జరిగిన గొడవ కారణంగా అతనికి ముసుగు వేసి తమతో పాటు తీసుకెళ్తారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు దొంగలు చనిపోగా, రాజీవ్‌‌ ప్రాణాలతో బయటపడతాడు.

కానీ ప్రమాద స్థలంలో రూ.17 కోట్ల నగదు కనిపించదు. దీంతో ఆ డబ్బు ఏమైందనే ప్రశ్న మొదలవుతుంది. పోలీసులు రాజీవ్‌‌ డబ్బును మాయం చేసి ఉండొచ్చని అనుమానిస్తారు. సస్పెన్షన్‌‌లో ఉన్న అనస్‌‌ అతనిపై మరింత నిఘా పెడతాడు. మరోవైపు దొంగల మనుషులు కూడా రాజీవ్‌‌ను వెంటాడుతుంటారు. చివరకు చిన్న యాక్సిడెంట్‌‌ చేసినా లక్షలు డిమాండ్‌‌ చేసే పరిస్థితి అతనికి ఎదురవుతుంది. అసలు రాజీవ్‌‌ ఖాతా కూడా లేని ఆ బ్యాంకుకు ఎందుకు వెళ్లాడు? రూ.17 కోట్లు ఎక్కడ మాయమయ్యాయి? రాజీవ్‌‌ నిజంగానే ఆ డబ్బును దాచాడా? అనేది మిగతా కథ. 
 

©️ VIL Media Pvt Ltd.