Reading Time: 2 minutes
Mugguru Kothulu New Melody Love Song Creates Buzz

Mugguru Kothulu Song: టాలీవుడ్‌లో చిన్న సినిమాలు, డిఫరెంట్ టైటిల్స్, ఫ్రెష్ కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడుతున్నాయి. ఇప్పుడు అలాంటి ప్రయత్నంతో వార్తల్లో నిలుస్తున్న మూవీ ‘ముగ్గురు కోతులు’. పేరు వినగానే ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అనిపించినా, ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే ప్రేమకథ కూడా ఉందని రీసెంట్ గా రిలీజ్ అయిన పాట వింటే తెలుస్తోంది. తేజ కొండపల్లి, వర్షిక పాశం జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ సాగే మెలోడీ లవ్ సాంగ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ పాటను నిన్న రిలీజ్ చేశారు. ఈ లవ్ సాంగ్ ఇప్పుడు సినిమాపై మరింత బజ్ తీసుకొస్తోంది. మెలోడీ పాట కావడంతో యూత్ ఆడియన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్‌ను కూడా ఈ సాంగ్ ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ పాటను విడుదల చేసిన అనూప్ రూబెన్స్ కూడా సినిమా మంచి విజయం సాధించాలని మూవీ టీమ్ ను అభినందించారు.

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో ఈ చిత్రాన్ని శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్నారు. కార్తీక్ గరిమెల్ల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం ఇందులో హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్‌కు వచ్చిన స్పందన తర్వాత ‘తిడుతున్నా కొడుతున్నా’ పాటను తీసుకురావడం ద్వారా సినిమాలో కామెడీ ట్రాక్ తో పాటు లవ్ ట్రాక్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఈ పాటకు ఎస్. సుహాస్ సంగీతాన్ని అందించగా, హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథ ఎలా మలుపులు తిరుగుతుంది అనేది మాత్రం తెరపై చూడాల్సి ఉంటుంది.

మరోవైపు ‘ముగ్గురు కోతులు’ షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అయితే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత మరిన్ని ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. డిఫరెంట్ టైటిల్‌తో మొదటి నుంచే ఇంట్రెస్టింగ్ బజ్ రేపిన ‘ముగ్గురు కోతులు’కు ఇప్పుడు లవ్ సాంగ్ కూడా తోడైంది. తేజ కొండపల్లి, వర్షిక పాశం మధ్య ప్రేమకథ ఎలా ఉండబోతోందనే విషయం అటుంచితే, ‘తిడుతున్నా కొడుతున్నా’ పాటలో చూపించిన తీరు మాత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.