Reading Time: 2 minutes
Ajay Devgns Comedy Film Dhamaal 4 Tops Netflix Trending

Dhamaal 4: థియేటర్లలో విడుదలైన రెండు నెలలు తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఒక అడ్వెంచర్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి జోరు చూపిస్తోంది. ఇది ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లోకి వెళ్లి, తాప్సీ పన్నూ ‘గాంధారి’ని కూడా వెనక్కి నెట్టింది. ఆ సినిమా మరేదో కాదు.. అజయ్ దేవగణ్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధమాల్ 4’ (Dhamaal 4). 2026 జూలై 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు అయితే వసూలు చేసింది. కానీ యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఓటీటీలో మాత్రం నెంబర్ 1లో ట్రెండింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ధమాల్’ ఫ్రాంచైజీలో ఇది నాలుగో భాగంగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో జూలై 10న విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉంది. సెప్టెంబర్ 3న తాప్సీ పన్నూ నటించిన ‘గాంధారి’ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ సినిమా కూడా విడుదలైన వెంటనే మంచి స్పందన తెచ్చుకుని ట్రెండింగ్‌లో టాప్ స్థానాల్లో నిలిచింది. అయితే ‘గాంధారి’ని ‘ధమాల్ 4’ ఇప్పుడు వెనక్కి నెట్టడం విశేషం.

‘ధమాల్ 4’ సినిమాకు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మోస్ట్ పాపులర్ బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజీలోని మునుపటి మూడు భాగాలకు (ధమాల్, డబుల్ ధమాల్, టోటల్ ధమాల్) కూడా ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. బాలీవుడ్‌లో ఎలాంటి లాజిక్స్ లేకుండా కేవలం హిలేరియస్ కామెడీతో తెరకెక్కించడంలో ఇంద్ర కుమార్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆ కామెడీ టైమింగ్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తోంది.

స్టోరీ

ఈ కథ గుడ్డు (అజయ్ దేవగన్), అతని మిత్రుడు జానీ (సంజయ్ మిశ్రా) ల చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరూ ఒక పాత వస్తువుల దుకాణం ( నడుపుతూ, ఎలాగైనా తక్కువ సమయంలో కోటీశ్వరులు అయిపోవాలని కలలు కంటుంటారు. ఈ క్రమంలో ఒకరోజు వారి దుకాణానికి వచ్చిన ఒక వింత వస్తువులో వారికి ఒక పురాతనమైన, ముక్కలైపోయిన మ్యాప్ దొరుకుతుంది. ఆ మ్యాప్ మరేదో కాదు.. కొన్ని వందల ఏళ్ల క్రితం సముద్రంలో దాచబడిన ఒక భారీ గుప్తనిధికి సంబంధించినది. అయితే ఆ మ్యాప్ పూర్తి వివరాలు తెలియాలంటే మిగిలిన ముక్కలను కూడా వెతకాల్సి వస్తుంది.

ఈ నిధి వేటలో వారికి ఒక కామెడీ సముద్రపు దొంగ తారసపడతాడు. అతని వల్ల ఆ మ్యాప్ ముక్కలు కాస్తా.. విడివిడిగా తిరుగుతున్న పాత ధమాల్ గ్యాంగ్ సభ్యులైన ఆదిత్య (రితేష్ దేశ్‌ముఖ్), మానవ్ (జావేద్ జాఫ్రీ), రాయ్ (అర్షద్ వార్సి) ల చేతుల్లో పడతాయి. దాంతో ఎవరికి వారు ఆ నిధిని దక్కించుకోవాలని ఒకరిపై ఒకరు కుయుక్తులు పన్నుకుంటూ రేస్ ప్రారంభిస్తారు. ఆ మ్యాప్ ఆధారాలు వారిని ఒక రహస్యమైన, ప్రమాదకరమైన దీవికి తీసుకువెళ్తాయి. ఆ దీవిలో ఉండే వింత జంతువులు, ఆఫ్రికన్ గిరిజన తెగలు, ప్రకృతి వైపరీత్యాల మధ్య ఈ గ్యాంగ్ మొత్తం పడే పాట్లు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. చివరికి అందరూ కలిసి ఆ నిధిని ఎలా కనుగొన్నారు, ఆ ప్రయాణంలో వారికి ఎలాంటి గుణపాఠం తెలిసొచ్చింది అనేదే ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ క్లైమాక్స్.