
లండన్: ఇండియా స్క్వాష్ ప్లేయర్ అనహత్ సింగ్.. పీఎస్‌ఏ గోల్డ్ ఈవెంట్ లండన్ క్లాసిక్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌తోనే సరిపెట్టుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన విమెన్స్ మ్యాచ్‌లో వరల్డ్ జూనియర్ చాంపియన్ అనహత్ 4–11, 4–11తో వరల్డ్ ఐదో ర్యాంకర్ సివసంగారి సుబ్రమణియమ్ (మలేసియా) చేతిలో ఓడింది. మ్యాచ్ ఆరంభం నుంచే తడబడిన ఇండియన్ ప్లేయర్ ఏ దశలోనూ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దాంతో వరుస గేమ్‌ల్లో పెద్దగా స్కోరు చేయలేదు. ఈ నెల 12 నుంచి జరిగే ఖతార్ క్లాసిక్ ఈవెంట్‌లో బరిలోకి దిగనున్న అనహత్.. 19 నుంచి జరిగే ఆసియా గేమ్స్ కోసం ఈ టోర్నీని ఉపయోగించుకోనుంది.