
మన హీరోలు తీసుకుంటున్న ఈ భారీ బ్రేక్స్ కారణంగా.. సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులకు హీరోలు దొరకడం లేదు. అదే అదునుగా తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొస్తున్నారు పరభాషా హీరోలు. మన హీరోలు డేట్స్ ఇవ్వకపోవడంతో.. రెడ్ కార్పెట్ వేసి మరీ పక్క ఇండస్ట్రీల్లోని హీరోలను మన దర్శకులు ఆహ్వానిస్తున్నారు. పైగా వాళ్ల సక్సెస్ రేట్ పీక్స్‌లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో పక్క భాషా హీరోల హవా బాగా కనిపిస్తుందిప్పుడు. వెంకీ అట్లూరి అయితే గత కొన్నేళ్లుగా వాళ్లతోనే ట్రావెల్ అవుతున్నారు. సార్ ధనుష్‌తో చేస్తే.. తన లక్కీ భాస్కర్‌ను దుల్కర్‌లో వెతుక్కున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ కథ తీసుకెళ్లి సూర్యతో చేసారు. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా తెలుగులోనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ధనుష్ సైతం తెలుగులోనే వరస సినిమాలు చేస్తున్నారు. తమిళంలోనూ బిజీగా ఉన్నా.. కుబేరాతో టాలీవుడ్‌లో మంచి హిట్ కొట్టారు. దానికి ముందు సార్ కూడా హిట్టే. ప్రస్తుతం ధనుష్‌కు కథలు చెప్పడానికి మన దర్శకులు చాలా మంది వేచి చూస్తున్నారు. కార్తి సైతం తెలుగు మార్కెట్‌పై గట్టిగానే ఫోకస్ చేసారు. ప్రస్తుతం మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్‌తో సినిమా చేస్తున్నారీయన. కళ్యాణ్ శంకర్‌తో పాటు శైలేష్ కొలను హిట్ 4 సినిమా చేయబోతున్నారు కార్తి. వీళ్లే కాదు.. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్, హిందీ నుంచి సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు సైతం మన ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు. దీనికి ఒక్కటే కారణం.. మన దర్శకులకు మిడ్ రేంజ్ హీరోలు దొరక్కపోవడమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్.. పొంచి ఉన్న పెను ముప్పు
డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ పాయింట్లు కట్
గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి
వారెవ్వా.. ఇకపై కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే
Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?