Reading Time: < 1 minute

గాంధీ దవాఖానలో అటెండర్పై దురుసు ప్రవర్తన.. కాంట్రాక్ట్ ఉద్యోగి తొలగింపు

Caption of Image.

పద్మారావు నగర్, వెలుగు: గాంధీ దవాఖానలో అత్యవసర విభాగానికి వచ్చిన ఓ రోగి సహాయకుడిపై దురుసుగా ప్రవర్తించిన కాంట్రాక్ట్ ఉద్యోగిని డీఎంఈ ఆదేశాల మేరకు హాస్పిటల్​ఇన్​చార్జి సూపరింటెండెంట్​ప్రొఫెసర్​వాణి విధుల నుంచి తొలగించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని ఓ యువకుడు శనివారం ఉదయం గాంధీ దవాఖానకు తీసుకొచ్చాడు. 4 గంటలుగా వైద్యం అందకపోవడంతో అతను నిలదీయగా.. అక్కడి కాంట్రాక్టు ఉద్యోగి వాగ్వాదానికి దిగి బయటకు వెళ్లాలని బెదిరించాడు.

ఈ తతంగాన్ని బాధిత యువకుడు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఘటనపై స్పందించిన ఇన్​చార్జి సూపరింటెండెంట్ సదరు ఉద్యోగిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.