Reading Time: < 1 minute

మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం ఇవి తినండి… డాక్టర్లు చెబుతోంది ఇదే..!

Caption of Image.

గట్ హెల్త్ మన తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం రోజు తీసుకునే ఆహారం జీర్ణవ్యవస్థలోని బాక్టీరియా సమతుల్యతకు తోడ్పడుతుంది. పులియబెట్టిన ఆహారం నుండి ఫైబర్ అధికంగా ఉండే పప్పుధాన్యాలు, కొన్ని రకాల పండ్ల వరకు మనం రోజు తీసుకునే ఆహారమే గట్ హెల్త్ ని మెరుగుపరచడంలో హెల్ప్ అవుతుందని అంటున్నారు డాక్టర్లు.

పెరుగు, పులియబెట్టిన ఆహారాలు, కొద్దిగా పచ్చిగా ఉన్న అరటిపండ్లు, బొప్పాయి, పీచుపదార్థం అధికంగా ఉండే పప్పుధాన్యాలు వంటివి గట్ హెల్త్ కి మంచిదని అంటున్నారు డాక్టర్స్. వీటిలో ప్రతి ఒక్కటీ పేగుకు మద్దతు ఇవ్వడానికి ఒక్కో విధంగా సహాయపడుతుంది.

పెరుగు:

పెరుగు, మజ్జిగ, సహజంగా పులియబెట్టిన ఈ ఆహారాలలో పేగులో మైక్రోబయోమ్ వైవిధ్యాన్ని పెంపొందించగల బ్యాక్టీరియా ఉంటుందని… ఇది గట్ హెల్త్ ని మెరుగుపరచడంలో తోడ్పడతాయని అంటున్నారు. ఇవి గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయని అంటున్నారు.

కొద్దిగా పచ్చిగా ఉన్న అరటిపండ్లు:

పూర్తిగా పండిన అరటిపండులా కాకుండా కొద్దిగా పచ్చిగా ఉన్న అరటిపండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది, ఇది పెద్దప్రేగులోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు ఇంధనంగా పనిచేస్తుంది.

►ALSO READ | Vastu tips: బెడ్రూంకు రెండు డోర్లు ఉండొచ్చా.. తలుపులపై దేవుడి బొమ్మలు ఉంటే పూజ చేయాలా..!

బొప్పాయి:

బొప్పాయిలో ఉండే ప్రోటీన్ జీర్ణక్రియలో పాల్గొనే పాపైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడి, మలవిసర్జనను సులభతరం చేస్తుందని అంటున్నారు డాక్టర్స్. అలాగే, బొప్పాయి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు.

పీచుపదార్థం అధికంగా ఉండే పప్పుధాన్యాలు:

పీచుపదార్థం అధికంగా ఉండే పప్పుధాన్యాలు, శనగలు, బీన్స్ వంటివి  ప్రీబయోటిక్స్‌గా పనిచేసి, ఆమ్లాలను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందిస్తాయి. ఈ బ్యాక్టీరియా ప్రేగుల రక్షణ పొర పనితీరుకు తోడ్పడుతుంది.
 

©️ VIL Media Pvt Ltd.