
KFC చికెన్ కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సిటీల్లో మాత్రమే కాకుండా టౌన్లలో కూడా కేఎఫ్సీ రెస్టారెంట్లు వెలిశాయంటే అర్థం చేసుకోవచ్చు దీనికున్న క్రేజ్. అయితే.. ఈ రెస్టారెంట్స్ లో వాడే చికెన్ నాణ్యతపై అడపాదడపా ఆరోపణలు వచ్చినప్పటికీ జనం కేఎఫ్సీ చికెన్ తినడం మాత్రం మానడం లేదు. ఇప్పుడు నోయిడాలో జరిగిన ఈ ఘటన చూస్తే KFC ఇష్టంగా తినేవాళ్లు కూడా ఛీకొడతారేమో అనిపిస్తుంది. గ్రేటర్ నోయిడా వెస్ట్ లోని ఓ కేఎఫ్సీ సెంటర్ అవుట్ లెట్ లో డీప్ ఫ్రై చికెన్ లో పురుగు కనపడింది. ఇందుకు సంబంధిచిన వీడియోను కస్టమర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.
KFC డీప్-ఫ్రైడ్ చికెన్ లో పురుగు ఉన్నట్లు ఒక వీడియోసోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీలోని గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని గౌర్ సిటీ మాల్‌లోని KFC అవుట్‌లెట్‌లో జరిగింది ఈ ఘటన. సదరు KFC ని ట్యాగ్ చేస్తూ మీ డీప్ ఫ్రైడ్ చికెన్ లో ఇప్పుడే ఒక పురుగు కనిపించిందని పోస్ట్ లో పేర్కొన్నాడు కస్టమర్.
Horrible @KFC_India …just got insect inside your deep fried chicken.. seriously not acceptable at all .. location – gaur City mall , Greater Noida West, uttar pradesh,
Time : 2:30pm, 5 Sept 3026 pic.twitter.com/BLrpoZ820d— scubidu (@averycommonman1) September 5, 2026
ఈ పోస్ట్ కి స్పందించిన KFC కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ… ఆర్డర్ డీటెయిల్స్ ఇస్తే తమ సిబ్బంది సమస్యను పరిష్కరిస్తారని రిప్లై ఇచ్చింది.
అయితే, నెటిజన్స్ మాత్రం కేఎఫ్సీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఔట్ లెట్ లో ఇంత నిర్లక్ష్యమా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ దెబ్బతో KFC చికెన్ తినాలంటేనే బయమేస్తోందంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.