
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రిలీజ్ సమయంలో కొన్ని షోలకే ఇబ్బంది పడిన ఈ చిత్రం, ఇప్పుడు భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ప్రదర్శితమవుతోంది. త్వరలోనే ఓవర్సీస్ లోనూ ఈ బ్లాక్ బస్టర్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు పన్ను మినహాయింపు కూడా లభించింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? ప్రస్తుతం నార్త్ ఇండియాలో రికార్డుల మోత మోగిస్తోన్న ఈ సినిమాపేరు ‘ హనుమాన్ అంశ్ ‘ కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ డివోషినల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకు పైగా వసూలు చేసింది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, ఇప్పటికే ఈ ఏడాది భారీ లాభాలు ఆర్జించిన సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ప్రారంభంలో ఈ సినిమా రిలీజ్ కు థియేటర్లు ఇచ్చేందుకు వెనుకంజ వేశారు. కానీ ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. త్వరలోనే విదేశాల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి పన్ను మినహాయింపు కూడా లభించింది. గతంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ వంటి చిత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు, కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి కూడా ఉత్తరాఖండ్‌లో పన్ను మినహాయింపు ప్రకించారు. ‘ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం, బోధనల ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి రాష్ట్రంలో పన్ను మినహాయిస్తున్నాం’ అని స్వయంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామి శుక్రవారం డెహ్రాడూన్‌లోని ఒక సినిమా హాలులో తన సతీమణి గీతా ధామి, కేబినెట్ సహచరులు గణేష్ జోషి, ప్రదీప్ బాత్రా అలాగే పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయడంలో ‘హనుమాన్ అంశ్’ వంటి చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ‘ఈ చిత్రం ద్వారా బాబా నీమ్ కరోలి మహారాజ్ జీ తపస్సు, త్యాగం, సేవ తదితర అంశాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఈ సినిమా ద్వారా హనుమంతునిపై ఆయనకున్న అచంచలమైన విశ్వాసాన్ని తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశం మాకు లభించింది. ఆయన జీవితమంతా మానవ సేవకు, ఆధ్యాత్మిక ఉన్నతికి, సమాజ సంక్షేమానికి అంకితం చేశారు. భక్తి అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని, అది సేవ, మానవ సంక్షేమానికి ఒక మార్గం కూడా అనే సందేశాన్ని బాబా నీమ్ కరోలి మహారాజ్ జీ జీవితం మనకు ఇస్తుంది’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
‘హనుమాన్ అంశ్’ అనేది నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లకు పైగా వసూలు చేసింది. రూ. 100 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా విదేశీ విడుదల హక్కులను ప్రతిష్ఠాత్మక హోంబలే ఫిల్మ్స్ కొనుగోలు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి