
Fatima Sana Send Off: భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఘోరంగా విఫలమైనప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర వివాదాస్పదమైంది. 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ షెఫాలీ వర్మ 6 బంతుల్లో 12 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. కానీ రెండో ఓవర్‌లో ఫాతిమా సనా బౌలింగ్‌లో షెఫాలీ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను ఫాతిమా సునాయాసంగా అందుకని, మైదానం వెలుపలికి వెళ్లాలంటూ షెఫాలీకి తీవ్ర ఆగ్రహంతో ఫైరీ సెండ్‌ఆఫ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
షెఫాలీ పగ తీర్చుకుందా? ఫాతిమా వేడుక వెనుక కథ:
నిజానికి పాక్ కెప్టెన్ ఫాతిమా సనా అంత ఉద్వేగంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ కారణం ఉంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో భారత్ తరఫున బౌలింగ్ చేసిన షెఫాలీ వర్మ, 5వ ఓవర్లో మునీబా అలీని అవుట్ చేసిన తర్వాత సరిగ్గా ఇదే తరహాలో ఆవేశంగా సంబరాలు చేసుకుంది. ఆ సంఘటనను మనసులో పెట్టుకున్న పాక్ కెప్టెన్ ఫాతిమా, షెఫాలీ వికెట్ పడగానే అదే రీతిలో సైగలు చేస్తూ మైదానం వీడాలని అగ్రెసివ్‌గా సంబరాలు చేసుకుంది.
55 రన్స్‌కే టీమ్ కుప్పకూలినా ఇంత సీనా:
ఫాతిమా సనా చేసిన ఈ ఓవర్ సెలబ్రేషన్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే 200 మ్యాచ్‌లలో ఇది అత్యల్ప స్కోరుగా నమోదైంది. పైగా బ్యాటింగ్‌లో కెప్టెన్ ఫాతిమా సనా సున్నా పరుగులకే (డకౌట్) వెనుతిరిగింది. సొంత జట్టు దారుణంగా ఘోర పరాజయం పాలవుతుంటే, ఇలా ప్రవర్తించడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
27/0 నుంచి ఘోర పతనం.. దాయాదికి కోలుకోలేని దెబ్బ:
పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు మునీబా అలీ (13), షవాస్ జుల్ఫికర్ (14) నిలకడగా ఆడుతూ జట్టును 27/0తో మంచి స్థితిలో నిలిపారు. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడటంతో ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి పాక్ పతనం వైపు కొనసాగింది. వెంటవెంటే వికెట్లు కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నా దాయాది జట్టు, మైదానంలో ఓవర్ యాక్షన్ చేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా వైఖరిపై క్రీడాభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
— pctstorage (@pctstorage_) September 5, 2026
Fatima giving send off after picking a wicket when Ind is chasing 56… pic.twitter.com/bhGo9PFSmy
— SSH (@SSH184593) September 5, 2026