Reading Time: < 1 minute
Nbk111 Dada Title Teaser Balakrishna Gopichand Malineni

నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం (NBK 111)కి ‘దాదా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో విడుదలైన టైటిల్ టీజర్ క్షణాల్లో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. అయితే, సాధారణ మాస్ ఎలివేషన్ల కంటే భిన్నంగా ఈ టీజర్‌లో చోటుచేసుకున్న ఓ తీవ్రమైన సన్నివేశం ఇప్పుడు చిత్రసీమతో పాటు నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే సీన్. స్టేషన్ నడిబొడ్డున ఉన్న ఆఫీసర్స్ టేబుల్‌పై దర్జాగా కూర్చుని, చుట్టూ తుపాకులు ఎక్కుపెట్టి నిలబడ్డ పోలీసుల వైపే బాలకృష్ణ స్వయంగా రైఫిల్‌ గురిపెట్టి హెచ్చరించే విజువల్స్ పీక్స్ అనిపించేలా ఉన్నాయి. “నాకు గురిపెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు… బుల్లెట్స్‌కి బలుపు ఉండాలి, గన్స్‌కి గట్స్ ఉండాలి” అంటూ విసిరిన డైలాగ్ ఫాన్స్ కి ఫీస్ట్ గా ఉన్నాయి.

ఇక కంటెంట్ చూస్తుంటే కనుక ముంబై బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌గా బాలకృష్ణ కనిపించబోతున్నారని అనిపిస్తోంది. చేతిలో గొడ్డలి, రక్తమోడుతున్న ఆయుధాలు, కళ్లజోడుతో ఇచ్చిన స్టైలిష్ మూమెంట్స్ సినిమా వయొలెన్స్ ఏ స్థాయిలో ఉండబోతోందో చాటిచెబుతున్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరింత వాయిలెంట్‌గా మార్చింది. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా బాక్సాఫీస్ వద్దకు రానున్న ఈ చిత్రం, ఇప్పటివరకు ఉన్న బాలయ్య మాస్ ఇమేజ్‌ను మించి వ్యవస్థలకే సవాల్ విసిరే సరికొత్త గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ప్రోమో గురించి విడుదలైన వీడియోను NBK111 DADA Release Promo ద్వారా చూడవచ్చు.