Reading Time: < 1 minute

IND-W vs PAK-W: పాక్‎తో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన టీమిండియా

Caption of Image.

మహిళల టీ20 ఆసియా కప్‎లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ హైఓల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ ఏలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 5) రాత్రి దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచులో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో హార్మన్ సేన మొదట బౌలింగ్ చేయనుంది.

ఇప్పటికే లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచులు గెలిచి సెమీస్‎కు చేరుకున్న టీమిండియా పాకిస్తాన్‎ను చిత్తు చేసి లీగ్ దశను అజేయంగా ముగించాలని భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ కూడా థాయిలాండ్ను ఓడించినప్పటికీ, నెట్ రన్ రేట్ సమీకరణాల దృష్ట్యా సెమీస్ ఆశలను పదిలం చేసుకోవడానికి భారత్‎పై విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.

మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?:

శనివారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ బ్లాక్బస్టర్ మ్యాచ్ను క్రికెట్ ప్రేమికులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్కు చెందిన సోనీ స్పోర్ట్స్ టెన్ 1 తో పాటు ప్రాంతీయ భాషల్లో సోనీ స్పోర్ట్స్ టెన్ 3, టెన్ 4 ఛానెళ్లలో ఈ మ్యాచ్ లైవ్ రానుంది. డిజిటల్ యూజర్లు సోనీ లివ్ (SonyLIV) యాప్, వెబ్సైట్లో ఈ మహా సంగ్రామాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. నాకౌట్ మ్యాచ్లకు ముందు తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భారత్, ఓటముల పరంపరకు అడ్డుకట్ట వేయాలని పాకిస్తాన్ చూస్తుండటంతో ఈ పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇండియా ప్లేయింగ్ లెవన్:

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందినీ శర్మ

పాకిస్తాన్ ప్లేయింగ్ లెవన్:

మునీబా అలీ, షావాల్ జుల్ఫికర్, గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, సదాఫ్ షమాస్, ఫాతిమా సనా (సి), ఎమాన్ ఫాతిమా, ఉమ్-ఎ-హని, తుబా హసన్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్

©️ VIL Media Pvt Ltd.