Reading Time: < 1 minute

ఏకే-203 రైఫిల్స్ ఐదేళ్ల ఒప్పందంపై అదానీ డిఫెన్స్, ఇండో-రష్యన్ రైఫిల్స్ సంతకాలు

Caption of Image.

భారత్-రష్యా ఏకే-203 రైఫిల్ ప్రోగ్రాంకు స్వదేశీ మందుగుండు సామగ్రిని అందించేందుకు అదానీ డిఫెన్స్ 5 ఏళ్ల ఒప్పందంపై సంతకం చేసింది. అదానీ డిఫెన్స్, ఇండో-రష్యన్ రైఫిల్స్ ఐదేళ్ల ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం ప్రకారం.. ఏకే-203 రైఫిళ్ల కోసం స్వదేశంలో ఉత్పత్తి చేసిన మందుగుండు సామగ్రిని అదానీ డిఫెన్స్ సరఫరా చేస్తుంది. ఈ ఒప్పందంతో రక్షణ తయారీ రంగంలో దేశీయ సామర్థ్యాలు, స్వావలంబన బలోపేతం అవుతాయని భారత్ భావిస్తోంది.

ఈ ఒప్పందం ప్రకారం.. భారతదేశ రక్షణ ఉత్పాదక వ్యవస్థలోని ఏకే-203 ప్రోగ్రాంకు చెందిన రెండు కీలక అంశాలైన ఐఆర్ఆర్పీఎల్ నుంచి రైఫిల్ ఉత్పత్తి, అదానీ డిఫెన్స్ నుంచి మందుగుండు సామగ్రి తయారీ అవుతుంది. మొట్టమొదటిసారిగా స్థానికంగా ఉత్పత్తి చేయబడిన రైఫిళ్లను, స్థానికంగా తయారు చేయబడిన మందుగుండు సామగ్రితో ఒకే సరఫరా ఒప్పందంలో అందించడమే ఈ ఒప్పందం లక్ష్యం.

ఏకే–47కు సరికొత్త వెర్షన్ ఈ ఏకే-203. ఏకే–47తో పోల్చితే ఏకే–203 అత్యాధునికమైనది. అలాగే ఎంతో తేలికైనది, శక్తిమంతమైనది. 3.8 కేజీల బరువున్న ఈ తుపాకీతో 400 మీటర్ల నుంచి 800 మీటర్ల రేంజిలో ఎఫెక్టివ్గా కాల్పులు జరిపే వీలుంటుంది. 300 మీటర్ల వరకు అయితే కచ్చితంగా గురితప్పకుండా కాల్చవచ్చు. దీనికి 30 రౌండ్ డిటాచబుల్ బాక్స్ మ్యాగజైన్, 50 రౌండ్ డిటాచబుల్ క్వాడ్ కాలమ్ మ్యాగజైన్లను అమర్చుకోవచ్చు.

►ALSO READ | పలు రాష్ట్రాల AICC ఇంచార్జులు మార్పు.. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్‎గా పీవీ మోహన్

నిమిషానికి 700 రౌండ్లు కాల్పులు జరపడం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. భారత సాయుధ దళాల కోసం AK-203 రైఫిళ్లను తయారు చేయడానికి, భారత్-రష్యా అంతర్-ప్రభుత్వ ఒప్పందం కింద 2019లో IRRPL స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ తయారీ కేంద్రం యూపీలోని అమేథీ జిల్లాలో ఉన్న కోర్వాలో ఉంది.

©️ VIL Media Pvt Ltd.