
వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలోని చింతల్ చెరువు దగ్గర బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2026 సెప్టెంబర్ 06వ తేదీన ఆల్టో కారు, టిప్పర్ లారీ బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు కారులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో నర్సింహులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహులు భార్య అంజమ్మ, వారి తమ్ముడి కుమారుడు అభిరామ్‌ల పరిస్థితి విషమంగా మారింది. బాధితులను పూడూరు మండలం గొంగుపల్లికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు.
వీరంతా సొంత పనుల నిమిత్తం కోస్గి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.