
హైదరాబాద్: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురైన మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురి రాథోడ్‌ను కుటుంబ సభ్యులు కాపాడారు.
ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని మాధురి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేసింది. నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మాధురి రాథోడ్ ఆరోపించింది.
ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వృత్తి రీత్యా ఫోక్ డ్యాన్సర్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇద్దరూ ఒకే రూమ్లో ఉండగా ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి.. లక్షల్లో మీమ్స్ ట్రెండ్ కావడంతో మాధురి రాథోడ్ పరువు పోయింది. ఈశ్వర్ సాయికి ఇప్పటికే పెళ్లయి ఒక బాబు ఉన్నాడు. ఈశ్వర్ సాయి భార్య శరణ్య పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. తన భర్త తప్పేం లేదనే తరహాలో మాట్లాడటంతో మాధురి రాథోడ్ మరింత మనస్తాపానికి లోనైంది.
జరిగిన ఎపిసోడ్లో తప్పంతా తనదే అనే తరహాలో ఈశ్వర్ సాయి భార్య మాట్లాడటంతో సోషల్ మీడియాలో మాధురి రాథోడ్కు కొందరు మద్దతుగా నిలిచారు. మాధురి రాథోడ్ తప్పు ఎంత ఉందో, ఈశ్వర్ సాయి తప్పు అంతే ఉందని సోషల్ మీడియాలో వాదోపవాదాలు నడిచాయి. ఈ టోటల్ ఎపిసోడ్ మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.