Reading Time: 2 minutes

రూ.20 వడా పావ్ కోసం… 15 వేలు ఖర్చు చేసి ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళింది..! ఒక వర్గానికి మీరు ఆదర్శం మేడం..!

Caption of Image.

ఇష్టమైన ఫుడ్ తినడం కోసం ప్లాన్ చేసుకొని మరీ వీకెండ్స్ లో రెస్టారెంట్స్ కి వెళ్లి తినేవాళ్లు  ఉంటారు. ఇందుకోసం ఓ పది కిలోమీటర్లు, మహా అయితే ఓ 20 కిలోమీటర్లు వెళ్లి తినొచ్చు.. తప్పు లేదు. వేలు ఖర్చు చేసి.. గంటల కొద్దీ జర్నీ చేసి మరీ ఇష్టమైన ఫుడ్ తినేవాళ్ళని ఎప్పుడైనా చూశారా..? అది కూడా రూ. 20 వడా పావ్ కోసం. అవును మీరు చదివింది నిజమే… వడా పావ్ కోసం ఓ యువతి ఏకంగా రూ.15 వేలు ఖర్చు చేసి ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళింది. ఆ లెజెండరీ విమెన్ ఎవరో మీరు కూడా చూడండి మరి..

ఢిల్లీకి చెందిన ఓ యువతి ఢిల్లీలో వడా పావ్ తినడానికి వెళ్ళింది.. అసలైన వడా పావ్ అంటే ముంబైలోనే కదా దొరికేది అనే ఆలోచన ఆమెకు వచ్చింది. దీంతో హుటాహుటిన ముంబైకి బయలుదేరింది. అది కూడా రూ.5 వేలు ఫ్లైట్ కొనుక్కొని మరీ… ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరింది సదరు యువతి. ముంబై ఎయిర్ పోర్టులో దిగగానే రూ.165 పెట్టి టీ తాగింది. ఆ తర్వాత 11 కిలోమీటర్ల దూరం 70 నిమిషాల పాటు జర్నీ చేసింది.

►ALSO READ | KFC చికెన్ మీ ఫేవరెటా..? ఓసారి ఇది చూడండి.. ఆ తర్వాత..!

ఇంత ప్రయాస పడి ఆమె వెళ్ళింది ఏ 5 స్టార్ హోటల్ కో కాదు.. సాదా సీదా రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ దగ్గరికి. అక్కడ మాత్రమే అతెంటిక్ వడా పావ్ దొరుకుతుందని ఆమె ఫీలింగ్. 

రూ.2 వడా పావ్ కోసం ఫ్లైట్ లో అంత దూరం జర్నీ చేయడమే కాకుండా రూ.4 వేలతో రూమ్ కూడా బుక్ చేసుకుందట. మొత్తానికి వడా పావ్ కోసం సుమారు రూ.15 వేలు ఖర్చు చేసింది సదరు యువతి. మరి, మీరైతే ఇష్టమైన ఫుడ్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేస్తారా..?

©️ VIL Media Pvt Ltd.