Reading Time: 2 minutes

కృష్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్, విజయ్ దేవరకొండ మధ్య పోటీ? ఆటో డ్రైవర్ గా అల్లు అర్జున్..? హాట్ టాపిక్‌గా ‘లాలో’ రీమేక్!

Caption of Image.

బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు సృష్టించే సంచలనాలు అసాధారణంగా ఉంటాయి. కథ నచ్చితే చాలు స్టార్స్ తో పనిలేకుండా బ్రహ్మరథం పడతారు ప్రేక్షకులు.  అలాంటిదే గుజరాతీ డివోషనల్ డ్రామా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.120 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అంకిత్ సఖియా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గుజరాతీ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడీ బ్లాక్‌బస్టర్ మూవీ టాలీవుడ్ రీమేక్ రేసులో హాట్ టాపిక్‌గా మారింది.

రేస్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్..

ఇప్పుడు ఇదే కథను తెలుగులోకి తీసుకొచ్చేందుకు మూడు నుంచి నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కృష్ణుడి పాత్ర విషయంలో ఒకే పేరు కాదు, ఏకంగా స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. నిర్మాత దిల్ రాజు.. కృష్ణుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు నిర్మాత మహావీర్ జైన్ స్వతంత్రంగా ఈ ప్రాజెక్టును తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారని, ఆయన రామ్ చరణ్‌ను కృష్ణుడిగా, అల్లు అర్జున్‌ను రిక్షా డ్రైవర్ పాత్రలో తీసుకోవాలని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

మిగతా భాషల్లోనూ భారీ డిమాండ్..

ఒరిజినల్ సహ నిర్మాత జై వ్యాస్ మాట్లాడుతూ.. ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, పంజాబీ, ఒడియా చిత్ర పరిశ్రమలకు చెందిన 3-4 బడా నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అయితే, కథలో ఉండే బలమైన ప్రాంతీయ నేటివిటీ కారణంగా హిందీ రీమేక్‌ను మాత్రం ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు చెప్పారు.

►ALSO READ | మోస్ట్ వాంటెడ్ ‘కామ్రేడ్ కళ్యాణ్’.. శ్రీవిష్ణు నయా కామెడీ ఎంటర్‌టైనర్ టీజర్ వచ్చేసింది!

కృష్ణుడిగా ఎవరు?

అయితే అసలు ప్రశ్న ఒక్కటే కృష్ణుడిగా విజయ్ దేవరకొండనా? రామ్ చరణా? లేక ఈ ప్రాజెక్ట్ మరేదైనా ఊహించని ట్విస్ట్ ఇస్తుందా? అన్న ప్రశ్న టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  రాబోయే నెల రోజుల్లో రీమేక్ పార్ట్‌నర్‌ను అధికారికంగా ఖరారు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ఆ తర్వాతే టాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తారు. భక్తి, భావోద్వేగాలు మేళవించిన ఈ డివోషనల్ వండర్ తెలుగు తెరపై ఏ రేంజ్ సునామీ సృష్టిస్తుందో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.