Reading Time: < 1 minute

హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. త్వరలో ఆర్టీసీ బస్, మెట్రో రైల్కు ఒకటే పాస్

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్ పబ్లిక్కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో ఆర్టీసీ మెట్రో రైల్ ఉమ్మడి పాస్ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని అధికారులను ప్రభుత్వ సీఎస్ ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్లను జారీ చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది.

మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడం గమనార్హం. ఉమ్మడి పాస్ జారీ చేయడానికి సాంకేతిక పరంగా సిద్ధంగా ఉన్నామని అధికారుల స్పష్టం చేశారు. ఉమ్మడి ఛార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే పాస్ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

►ALSO READ | త్వరలోనే ప్రజల్లోకి వస్తా.. నదీ జలాలపై యుద్ధం చేస్తా: కేసీఆర్

©️ VIL Media Pvt Ltd.