
జైపూర్(భీమారం), వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారంలోని గొల్ల వాగు ప్రాజెక్ట్ సమీపంలో దాదాపు 20 ఎకరాల్లో నందనం ఫాం స్టేస్, గ్రీన్ సిటీ డెవలపర్స్ పేరుతో అక్రమంగా కొనసాగుతున్న వెంచర్లో ప్లాట్లను కొని మోసపోవద్దని ప్రజలకు అధికారులు సూచించారు. ఆ వెంచర్పనులను శనివారం పంచాయతీ సెక్రటరీ మల్లేశ్ అడ్డుకొని అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. సాగు భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని, ప్రభుత్వ అనుమతులు లేని వెంచర్ లో ప్లాట్లు కొని మోసపోవద్దని హెచ్చరించారు. నాలా పన్ను చెల్లించి, లేఅవుట్ పర్మిషన్ పొందిన తర్వాతే ప్లాట్లు అమ్మాలని నోటీసుల్లో నిర్వాహకులకు తెలియజేశారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని, నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని హెచ్చరించారు.