Reading Time: < 1 minute

MLA Vs Former MLA: గోసి, గొంగడితో వచ్చి బోడి టీచర్ ఉద్యోగంతో..ఇన్ని ఆస్తులు ఎట్లా సంపాదించినవ్?

Caption of Image.
  • రసమయిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఫైర్

తిమ్మాపూర్, వెలుగు: ‘నాలాగా డాక్టర్​ కాదు కదా నువ్వు. నా దగ్గరకు రావాలంటే రూ.500 ఫీజు ఇవ్వాలి. అటువంటి మనిషిని నేను. నీ బతుకేంది. అడక్కతినుడేనాయే.. గోసి గొంగడి వేసుకొని వచ్చినోడివి. అట్లాంటి నీకు. ఫాం హౌస్​లు ఎట్లచ్చినయ్​.. కోళ్లఫారాలు ఎట్లచ్చినయ్.. నీ ఉద్యోగం.. బోడి టీచరు ఉద్యోగం.. అక్కడా, చిల్లర చిల్లర పనులు చేస్తే తుక్కుతుక్కు కొట్టి పంపించిన్రు. కాబట్టి మాట్లాడే ముందు ఆధారాలతో మాట్లాడాలి’. అంటూ మానకొండూర్  ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​పై ఫైర్​ అయ్యారు. కరీంనగర్  జిల్లా తిమ్మాపూర్​ మండలంలోని ఎల్ఎండీ క్యాంప్​ ఆఫీస్​లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రసమయిపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలను పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు తప్పుబట్టారు.​వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.  
 

©️ VIL Media Pvt Ltd.