Reading Time: 2 minutes
Bigg Boss Telugu 10: ఇన్‌స్టా రీల్స్‌తో ఫేమస్.. ఇప్పుడు బిగ్‌బాస్‌ 10లోకి.. షాలినీ పటేల్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరుగుతోంది. హోస్ట్ నాగార్జున తన దైన పంచ్ డైలాగులతో షోను రక్తికట్టిస్తున్నారు. అదే సమయంలో హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ కు మొదటి రోజే టాస్క్ లు ఇస్తూ వారిలోని ట్యాలెంట్, ఓపికను పరీక్షిస్తున్నాడు. కాగా ఇప్పటివరకు అగ్ని పరీక్ష సీజన్ నుంచి ఇద్దరు మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు. సింగర్ కమ్ రైతు బిడ్డ ఝాన్సీతో పాటు అప్ కమింగ్ ఆర్టిస్ట్ అమన్ మసూద్ బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే అగ్ని పరీక్ష సీజన్ 2 లోనే సత్తా చాటిన తెలుగమ్మాయి షాలినీ పటేల్ బిగ్ బాస్ తెలుగు 10 ఎనిమిదో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా షాలినీ ఎంపికపై కాస్త డ్రామా జరిగింది.  అగ్నిపరీక్ష లో ఫైనల్ అయిన వాళ్లలో ఎవరో ఒకర్ని ఎనిమిదవ కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేయమని నవదీప్ కి ఛాన్స్ ఇచ్చారు. నవదీప్ అనూహ్యంగా షాలినీ పటేల్ ని సెలెక్ట్ చేసారు. దీంతో బిగ్ బాస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది షాలినీ పటేల్.

ఇక షాలినీ పటేల్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలో ఉండే తెలుగమ్మాయి.  సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ బిగ్ బాస్  గేమ్‌లో స్ట్రాటజీతో ఆడతాను. సాధారణంగా  నేను చాలా ఎక్కువ మాట్లాడుతుంటాను. నేనేంటో  బిగ్ బాస్ హౌస్‌లో మీరు  కూడా చూస్తారు’ అని ధీమా వ్యక్తం చేసింది షాలినీ పటేల్. మరి అగ్ని పరీక్షలో సత్తా చాటిన ఈ బ్యూటీ సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఎదుర్కొని హౌస్ లో ఎలా నిలుస్తుందో చూడాలి.

ఆస్ట్రేలియా టు బిగ్ బాస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి