Reading Time: < 1 minute

బాలయ్య సినిమా టైటిల్ ‘దాదా’.. ఒక్క డైలాగ్తో ఫ్యాన్స్ ఫిదా..!

Caption of Image.

‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. ఈ సినిమా టైటిల్ ‘దాదా’. డిసెంబర్ 24, 2026న ఈ సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య విలన్లను ఊచకోత కోస్తున్న కొన్ని దృశ్యాలను ఈ టైటిల్ గ్లింప్స్లో వదిలారు.

అంతేకాదు.. మాస్ ప్రేక్షకులే టార్గెట్గా బాలయ్య స్టైల్లో ఒక డైలాగ్ కూడా మెప్పించింది. ‘‘నాకు గురిపెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగర్ ఉంటే సరిపోదు.. బులెట్స్కి బలుపుండాలి.. గన్స్కు గట్స్ ఉండాలి’’ అని బాలయ్య చెప్పిన డైలాగ్ ఈ టైటిల్ గ్లింప్స్ వీడియోలో హైలైట్ అయింది. ఈ ‘దాదా’ సినిమాకు థమన్ మరోసారి గట్టిగానే డ్యూటీ చేశాడని గ్లింప్స్లో వినిపించిన బీజీఎంతో తేలిపోయింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

►ALSO READ | ఈ వారం ఓటీటీ సినిమాలు: కంటెంట్తో కిక్కిచ్చే మథిమారన్, ఐ నో బడీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఓవరాల్గా చెప్పాలంటే.. ‘దాదా’ టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ‘పైసా వసూల్’ సినిమాలో బాలయ్యలో కనిపించిన ఫన్ యాంగిల్ ఈ సినిమాలో కూడా ఉందని అర్థమైంది. బాలకృష్ణ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 111వ చిత్రం.  క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం గమనార్హం. మంచు మనోజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. బాలకృష్ణ, మంచు మనోజ్ కలిసి ‘‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా..!’’ అనే సినిమాలో ఇప్పటికే నటించిన సంగతి తెలిసిందే.

©️ VIL Media Pvt Ltd.