స్కిన్ కేర్ అనగానే చాలా మందికి పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లు, ఖరీదైన మేకప్ కిట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ మన కిచెన్‌లో వేస్ట్‌గా పారబోసే బియ్యం కడిగిన నీటితో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అవును బియ్యం నీటిలో ఫెరూలిక్ యాసిడ్‌తో సహా కొన్ని మొక్కల సమ్మేళనాలు, పోషకాలు ఉంటాయి, ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, మృదువుగా చేయడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ బియ్యం నీటిని చర్మ సంరక్షణకు ఎలా వాడాలో చూద్దాం.
టోనర్: రైస్ వాటర్‌ను మనం టోనర్‌గా వాడవచ్చు. ఇందుకోసం బియ్యాన్ని నీటిలో నానబెట్టి, ఆ తర్వాత నీటిని వడకట్టండి. ఆ బియ్యం నీటిలో కొద్దిగా కలబంద జెల్ లేదా రోజ్ వాటర్‌ను యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి. దాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఫేస్‌పై స్ప్రే చేసుకోండి. ఇది చర్మాన్ని తాజాగా కనిపించేలా చేయడమే కాకుండా కాంతింవంగా మారుస్తుంది.
ఫేస్ మాస్క్ : మనం అన్నం వండినప్పుడు వచ్చే గంజిని పారబోయకుండా దాన్ని ఒక పాత్రలోకి తీసుకొని అది చల్లారిన తర్వాత అందులో కాస్త తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోండి. సుమారు 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీతిలో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కొన్ని రోజుల్లోనే మీ ముఖం మిళమిళా మెరిసిపోతుంది.
రైస్ వాటర్ ఐస్‌ప్యాక్: మీరు బియ్యం కడిగిన నీటిని ఒక గ్లాస్లో తీసుకొని వాటిని ఓ ఐస్‌ట్రేలో పోసి ఆ ట్రేను ఢీ ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచండి. మార్నింగ్ అయ్యే సరికి అది ఐస్ క్యూస్లా మారుతుంది. ఆ ఐస్‌క్యూబ్‌తో ఫేస్‌పై సున్నితంగా మసాజ్ చేయండి.ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ఎక్కడైన వాపులు ఉన్నా తగ్గుతుంది. అయితే ఐస్ ప్యాక్‌ను ఎక్కువ సమయం చర్మంపై ఉంచకండి.
కమిలిన చర్మం: కొన్ని సార్లు ఎండ కారణంగా ఫేస్ మొత్తం కమిలి పోతుంది. అలాంటి సమయాల్లో రైస్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రైస్ వాటర్, దోసకాయ రసం, కలబంద జెల్ బాగా కలిపి దాన్ని ఫేస్‌కు రాసుకోండి. కాసేపు అలాగే ఉంచి కడిగేయండి. ఒక వేళ మీకు తీవ్రమైన మంట, నొప్పి లేదా బొబ్బలు ఉంటే ఇవి ఫాలో అవ్వడం మంచిది కాదు.. నేరుగా వైద్యుడినే సంప్రదించడం మంచిది. మొత్తం ఈ రైస్ వాటర్ అనేది చర్మ సంరక్షణకు సాధారణ ఇంటి చిట్కాగా మాత్రమే వాడొచ్చు.. కానీ ఇది పూర్తి నివారణ కాదు. Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వాడే ముందు నిపుణుల సలహా తీసుకోండి.




