
ఆ మాజీ మంత్రి దారెటు..? ఏ పార్టీ వైపు చూస్తున్నారు..? ఆమె ఏమనుకుంటున్నారో కానీ బీఆర్ఎస్ మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది. తమ పార్టీలోకి మాత్రం రానిచ్చేదిలేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తమ పార్టీలోకే కాదు… ఆఫీస్ గేట్‌ను కూడా తాకనివ్వబోమని ముందుగానే చెప్పేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు అంత కఠినంగా మాట్లాడటానికి కారణమేంటి..? అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో తాజా మాజీ మంత్రి కొండా సురేఖ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్. ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యలతో మొదలైన వివాదం… సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేదాకా వెళ్లింది. పదవి కోల్పోయినప్పటికీ ప్రస్తుతానికైతే సురేఖ సైలెంట్‌గానే ఉన్నారు. ఆమె భవిష్యత్ కార్యాచరణపై మరికొద్దిరోజుల్లో క్లారిటీ రావొచ్చు. అయినప్పటికీ… అప్పటికే ఆమె ఫ్యూచర్ ప్లాన్స్‌పై ఊహాగానాలు జోరుగా జరుగుతున్నాయి. ఆమె కాంగ్రెస్‌ను వీడటం ఖాయమని… ఏదో ఒక పార్టీలోకి వెళ్తారనే చర్చ చాలారోజులుగానే జరుగుతోంది. కొండా కుటుంబం ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని ఆమె అనుచరులు చర్చించుకుంటున్నారట. మొదటిది బీఆర్ఎస్. రెండోది బీజేపీ. మూడోది జనసేన. ఈ మూడు పార్టీల్లో ఏదో ఒకదాంట్లోకి కొండా కుటుంబం వెళ్లడం ఖాయమనే చర్చ నడుస్తోందట. సురేఖ బీఆర్ఎస్‌లోకి వెళ్లవచ్చనే చర్చను గమనించిన గులాబీ దండు ముందుగానే అప్రమత్తమైందట. కొండా సురేఖను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీలోకి రానివ్వబోమని బీఆర్ఎస్ నేతలు కుండబద్దలు కొట్టేస్తున్నారట. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి లాంటి నేతలు ఒక అడుగు ముందుకేసి సురేఖను బీఆర్ఎస్‌లోకి కాదు కదా… తమ పార్టీ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ గేట్‌ను కూడా తాకనివ్వబోమన్నారు. తాను బీఆర్ఎస్‌లో చేరతానని కానీ… చేరాలనుకుంటున్నట్టు గానీ కొండా సురేఖ కానీ… ఆమె కుటుంబం కానీ చెప్పనేలేదు. అయినప్పటికీ ముందుగానే బీఆర్ఎస్ నేతలు నో ఎంట్రీ బోర్డు పెట్టడానికి అనేక కారణాలున్నాయట. గతంలో కొండా సురేఖ బీఆర్ఎస్‌లో పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆమె భర్త కొండా మురళికి ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్.
2018 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీఆర్ఎస్‌తో కొండా కుటుంబానికి పంచాయితీ ముదిరింది. అన్ని పదవులు ఇచ్చిన తర్వాత కూడా కొండా సురేఖ తమ కుటుంబానికి ఇంకో టికెట్ ఇవ్వలేదంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా BRS పార్టీ ముఖ్య నేతలను విమర్శించి బయటకు వెళ్లిపోయిన విషయం గుర్తు చేస్తున్నారు గులాబీ నేతలు. సురేఖకు ఎమ్మెల్యేగా, మురళికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన పార్టీని, అధినేత కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించిన సురేఖను మళ్లీ రానివ్వబోమని తేల్చి చెబుతున్నారట బీఆర్ఎస్ నాయకులు. ఇదంతా ఒకవైపు ఉంటే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ అయ్యాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణం అంటూనే నోటికొచ్చినట్టు తిట్టారు. సీరియస్‌గా తీసుకున్న కేటీఆర్… కొండా సురేఖపై పరువు నష్టం దావా కూడా వేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొండా సురేఖను మళ్ళీ బీఆర్ఎస్‌లోకి రానిచ్చే పరిస్థితి లేదంటున్నారు గులాబీ నేతలు. సాధారణంగా అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే వస్తామంటే రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తుంది ప్రతిపక్షం. కానీ కొండా సురేఖ విషయంలో అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పైనే చెప్పలేని రీతిలో విమర్శలు చేసిన కొండా సురేఖ లాంటివారిని మళ్లీ పార్టీలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయి అంటున్నారట సీనియర్ నేతలు. అందుకే కొండా సురేఖ బీఆర్ఎస్‌లోకి వస్తుందా లేదా తెలియక ముందే ఆమెను పార్టీలోకి రానివ్వబోమని అడ్వాన్స్‌గా చెప్పేస్తున్నారట. అది కాక ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు కావాల్సినంత మంది నాయకులున్నారు. కొండా కుటుంబం వస్తే లేనిపోని పంచాయితీలు వస్తాయనే ఆలోచన ఆ పార్టీలో ఉందట. అదే సమయంలో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని… ఒకవేళ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా కొండా దంపతులను పార్టీలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారట మరికొందరు నేతలు.
సురేఖ భవిష్యత్ కార్యాచరణపై మరికొద్దిరోజుల్లో క్లారిటీ