
నకిరేకల్: సంస్కారం ఉంది కాబట్టే మీరు బతికిపోయారని బీఆర్ఎస్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీతక్క, సురేఖ చేత రాఖీ కట్టించుకుని గౌరవించానని.. సొంత చెల్లెలు రాఖీ కట్టడానికి వస్తే గెంటేసిన వ్యక్తి KTR అని సీఎం చెప్పారు.
Vintage Revanthanna is back with sharp counters! 🔥
KTR questioned my decency today.
I have decency that’s why I welcomed Konda Surekha when she came to tie Rakhi to me. But you didn’t even allow your own sister to tie Rakhi to you and ran away to the US! pic.twitter.com/7KTxpESAVE
— Indiramma Rajyam (@IndirammaRajya) September 5, 2026
ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని గెంటేసిన దుర్మార్గుడు కేటీఆర్ అని సీఎం విమర్శించారు. ‘నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తే.. తెలివి అనుకుంటున్నావ్.. సభకు రా.. నా చదువేందో.. నీ చదువేందో తేల్చుదాం’ అని కేటీఆర్కు సీఎం సవాల్ విసిరారు.
లక్ష కోట్లు అయ్య దోచుకుంటే.. చెల్లికి వాటా ఇవ్వలేదని.. వాటా ఇవ్వాల్సి వస్తదని చెల్లిని గెంటేశాడని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. ఇలాంటి దుర్మార్గులు మీ కోసం ఆలోచిస్తారా అని ప్రజలను సీఎం రేవంత్ ప్రశ్నించారు. సొంత చెల్లికి అన్నం పెట్టనోడు.. మీ కోసం ఏం చేస్తాడని.. ఒక్కసారి ఆలోచన చేయండని సీఎం రేవంత్ ప్రజలకు సూచించారు.
►ALSO READ | దమ్ముంటే తండ్రీకొడుకులు శాసన సభకు రండి: నకిరేకల్ గడ్డపై సీఎం రేవంత్ సవాల్
గంజాయి తాగి కొడుకు వ్యవహరిస్తే.. తండ్రి మందలించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. KTR భయంతోనే కేసీఆర్ ఫాంహౌస్లో పడుకున్నాడని సీఎం రేవంత్ చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఇప్పటికీ కేసీఆర్ సభకు రాలేదని సీఎం రేవంత్ గుర్తుచేశారు.