
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాల ఏఐసీసీ ఇంచార్జులను మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్‌గా ఏపీ మోహన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఉండేవారు. మహారాష్ట్ర ఇంచార్జ్‌గా శ్రీవెల్లప్రసాద్కు బాధ్యతలు అప్పగించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌కు పార్టీ ఇంచార్జ్‌గా సచిన్ పైలట్‌ను నియమించింది. దీంతో పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలకు ఏఐసీసీ పుల్‌స్టాప్ పెట్టింది.
ఇక, ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ఏఐసీసీ ఇంచార్జ్‌గా సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా అదనపు బాధ్యతలు అప్పగించింది. అస్సాంకు మాజీ సీఎం భూపేష్ బఘేల్, ఛత్తీస్‌గఢ్‌కు సుఖ్‌దేవ్ భగత్‌ను ఏఐసీసీ ఇంచార్జులుగా అపాయింట్ చేసింది. ఆకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జులను మార్చడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
►ALSO READ | దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్17 .. తొలిసారి 36 వేల కి.మీ. ఆర్బిట్‌లోకి ఇస్రో ఇమేజింగ్ శాటిలైట్