Reading Time: < 1 minute

వేగంగా బలపడుతున్న ఎల్ నినో.. భారత్పై తీవ్ర ప్రభావం..

Caption of Image.

మధ్య, తూర్పు ఉష్ణ మండల పసిఫిక్ ప్రాంతంలో అసాధారణంగా వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా ఎల్ నినో బలపడుతోంది. ప్రస్తుతం ఈ జలాలు వేడెక్కడం మరింత స్పష్టంగా కనిపిస్తోందని తాజా పరిశీలనలు వెల్లడిస్తున్నాయి.

ఎల్ నినోను పర్యవేక్షించడానికి ఉపయోగించే కీలకమైన నినో 3.4 సూచిక జులైలో సాధారణం కంటే దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. వీక్లీ రీడింగులు సగటు కంటే సుమారు 2.2 డిగ్రీల నుంచి 2.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. ఎల్ నినో ఇది మరింత బలపడేందుకు దారి తీస్తోంది.

బలమైన ఎల్ నినో కారణంగా కొన్ని ప్రాంతాలు సుదీర్ఘకాలం పాటు పొడి వాతావ రణాన్ని, కార్చిచ్చులు (వైల్డ్ ఫైర్స్), నీటి భద్రతా ముప్పులను ఎదుర్కొంటే, మరికొన్ని ప్రాంతా ల్లో భారీ వర్గాలు, వరదలను అనుభవించవ చ్చు రాబోయే నెలలో ప్రపంచంలోని అనేక భూభాగాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణో గ్రతలు నమోదవుతాయని అంచనా.

భారతదే శం విషయానికి వస్తే, బలపడుతున్న ఎల్ నినో నైరుతి రుతుపవనాలు, నీటి సరఫరా, వ్యవసా యంపై అదనపు ఒత్తిడిని తెస్తుంది. ఎల్ నినో చారిత్రాత్మకంగా బలహీనమైన లేదా అస్థిర రుతుపవనాల వర్షపాతంతో ముడిపడి ఉంది.

ALSO READ : జీ మీడియా అధినేతపై సుభాష్ చంద్రపై CBI కేసు

అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఇది మరింత బలపడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే భారత్లో ఆగస్టులో గణనీయమైన వర్షపాత లోటు నమోదు కాగా, సెప్టెంబర్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అయితే, ఎల్ నినో అన్ని ప్రాంతాలలో ఒకేలాంటి ప్రభావాలను చూపదు. దీని ప్రభావం భౌగోళిక పరిస్థితులు, కాలం, అలాగే హిందూ, అట్లాంటిక్ మహాసముద్రాలలోని ఇతర వాతావరణ సరకులతో దాని పరస్పర చర్యలపై ఆధారపడి ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.